Breaking News

‘ఏంటి రష్మీ.. ఆ విషయంపై నోరు విప్పవే?’


ఒక్కోసారి నెటిజన్లు తెలిసో తెలీకో చేసే తప్పుల వల్ల సెలబ్రిటీలు ఇబ్బందులు పడతారు. తాజాగా ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఇదే సమస్య ఎదురైంది. అసలేం జరిగిందంటే.. దసరా సందర్భంగా కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో పాటు ఇతర జబర్తస్త్ ఆర్టిస్ట్‌లతో సుధీర్ ఇంట్లో దెయ్యం అనే టీవీ ప్రోగ్రామ్‌ను ఇటీవల షూట్ చేశారు. దసరా రోజు ప్రసారం చేస్తామంటూ ఓ రేంజ్‌లో హైప్ చేశారు. అయితే ఈ షోలో ఓ కోతిని కట్టేసి తీసుకొచ్చారు. ప్రేక్షకులకు కాసిన్ని నవ్వులు పంచేందుకు మూగ జీవాల్ని షోకు తీసుకురావడం సబబు కాదు. అందులోనూ మూగ జీవాలను హింసిస్తే రష్మీ అస్సలు ఊరుకోదు. ఇప్పటికే వాటిపై వైలెన్స్ ఆపాలంటూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. అయితే షోలో కోతి పిల్లను తీసుకురావడంపై ఓ నెటిజన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘రష్మీ.. వీధి కుక్కలపై, ఇతర మూగ జీవాలపై నువ్వు చూపుతున్న కేర్ చూసి నాకెంతో సంతోషం వేసింది. కానీ ‘సుధీర్ ఇంట్లో దెయ్యం’ అనే షోలో కోతి పిల్లను కట్టేసి తీసుకొచ్చారు. మరి ఈ విషయంలో నువ్వు నోరు విప్పలేదేం? ఇన్ని రోజులూ నువ్వు చేసింది ఏంటి?’ అని ప్రశ్నించాడు. ఇందుకు రష్మి స్పందిస్తూ.. ‘నేను మూగ జీవాల కోసం చేస్తున్న మంచి పనిని నువ్వు గుర్తించినందుకు ధన్యవాదాలు. కానీ సుధీర్ ఇంట్లో దెయ్యం షోలో కోతి పిల్లను తీసుకొచ్చిన ఎపిసోడ్‌లో నేను లేను. ఎపిసోడ్‌ను మరోసారి జాగ్రత్తగా చూడండి’ అని సమాధానమిచ్చారు. జరిగిన తప్పిదం తెలుసుకుని సదరు నెటిజన్ మౌనంగా ఉండిపోయాడు. జబర్తస్త్ కామెడీ షో యాంకర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌లపై సోషల్ మీడియాలో ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా మంచి విషయంపై తమ అభిప్రాయాలు వెల్లడించాలని అనుకుంటారు. కానీ వాటిలోనూ తప్పులు వెతికి మొన్న నువ్వు చేసిందేంటి? అలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకున్నావ్? అంటూ పలువురు నెటిజన్లు వారినే తప్పుబడుతుంటారు. సాధారణంగా ఇలాంటి కామెంట్స్‌ను రష్మి, అనసూయ ఎక్కువగా పట్టించుకోరు. కానీ అవి మితిమీరినప్పుడే ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.


By October 08, 2019 at 09:47AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/netizen-questions-anchor-rashmi-gautam-for-not-raising-voice-against-animal-cruelty-in-sudheer-intlo-deyyam-show/articleshow/71487011.cms

No comments