Breaking News

వెంకీమామ ఫస్ట్ గ్లిoప్స్.. మామ,అల్లుడు మాస్ జాతర


ఈమధ్య పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు అదరగొడుతున్నాయి. అయితే ఇప్పుడు అదే బ్యాక్ డ్రాప్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీ అయిపోయారు మామ అల్లుళ్లు అయిన అండ్ . ఈ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆల్రెడీ ఒకసారి శాంపిల్ చూపించారు. ఈసారి మాత్రం సినిమాతో ఫుల్ మీల్స్ పెట్టించడానికి రెడీ అయిపోయారు. ఆల్రెడీ ఇప్పటికే ఒక చిన్న టీజర్ ఇచ్చారు. ఇప్పుడు దసరా పండగా సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లిoప్స్ రిలీజ్ చేశారు. Also Read: 30 సెకండ్స్‌కి పైగా నిడివి ఉన్న ఆ టీజర్‌లో మొత్తం మెరుపులే. ఫస్ట్ షాట్‌లోనే వెంకటేష్ మోటార్ బైక్ పై 'జై జవాన్, జై కిసాన్' అనే బోర్డు చూపించి ఈ సినిమా బేసిక్ పాయింట్ ఏంటి అనేది ప్రెజెంట్ చేశారు. ఇక ఈ టీజర్ అంతా కూడా వెంకీ హవా సాగింది. రెండు డైలాగ్స్ కూడా వెంకటేష్ మీదే కట్ చేసారు. ఒకసారి పవర్ ఫుల్‌గా డైలాగ్ చెప్పి ఫైట్ షురూ చేసిన వెంకీ మరొక చోట 'ఐ లవ్ యు అనేసింది' అని ఉబ్బితబ్బిబవుతూ కామెడీ పండించాడు. అది మళ్ళీ F2 ని గుర్తు చేస్తుంది. ఇక రెండు చోట్లా కూడా కూడా చైతూని అల్లుడు అని పిలుస్తూనే డైలాగ్స్ చెప్పాడు వెంకటేష్. అంటే సినిమా అంతా కూడా అలానే ఉండబోతుంది. అయితే ఈ మాత్రం మాస్, ఈ మాత్రం కామెడీని నమ్ముకుని ఈసినిమా చెయ్యరు వెంకటేష్ అండ్ చైతూ. సో , సినిమాలో అదిరిపోయే సోల్ పాయింట్ ఎదో ఉంది ఉంటుంది. Also Read: ఇప్పటివరకు ఇద్దరి ప్రొఫెషన్స్‌ రివీల్ చేసారు, ఇద్దరి నేపధ్యం చూపించారు. కానీ అంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళ కథ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎలా క్రియేట్ చేశారు, అది ఎంత బలంగా ఉంది అన్నదానిమీదే వెంకీమామ విజయం అనేది ఆధారపడి ఉంటుంది. నిజంగా ఆ పాయింట్‌లో బలం ఉంటే మాత్రం వెంకటేష్ అండ్ చైతూ ఈ సినిమాకి ప్రధానబలంగా మారతారు. ఇక ఈ ఫస్ట్ గ్లిoప్స్ మాత్రం ఇద్దరు హీరోయిన్స్‌కి కూడా అస్సలు చోటు ఇవ్వలేదు. విజువల్ క్వాలిటీ, పల్లెటూరి అందాలను క్యాప్చర్ చేసిన విధానం మాత్రం సూపర్. ఇక థమన్ కూడా సినిమాకి తగ్గట్టుగానే మంచి సూతింగ్ ఆర్.ఆర్ ఇచ్చాడు. ఓవర్ ఆల్‌గా చూస్తే వెంకీమామ మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగానే కనిపిస్తుంది. ఫస్ట్ గ్లిoప్స్ మాత్రం అదే ఫీలింగ్ కల్పించింది సినిమాపై అంచనాలు పెంచింది.ప్రమోషనల్ మెటీరియల్ అంతా కూడా ఇలానే ఉంటే వెంకీమామ ఓపెనింగ్స్ కూడా ఇరగ్గొట్టేస్తాడు. ఆల్ ది బెస్ట్ టు వెంకీమామ అండ్ అక్కినేని అబ్బాయ్.


By October 08, 2019 at 12:20PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-venkatesh-and-naga-chaitanya-glitters-in-venky-mama-first-glimpse/articleshow/71488358.cms

No comments