Breaking News

London: కీచక ప్రొఫెసర్.. యూనివర్శిటీ లైబ్రరీలోనే స్టూడెంట్‌తో శృంగారం


విద్యార్థులకు పాఠాలు చెప్పి మంచి నడవడిక నేర్పాల్సిన అధ్యాపకుడే దారితప్పాడు. తన వద్దను చదువుకుంటున్న ఓ విద్యార్థినిని బెదిరించి లోబరుచుకుని లైంగిక కోరికలు తీర్చుకుంటున్నాడు. తన కామక్రీడలకు ఏకంగా కాలేజీ లైబ్రరీనే వేదిక చేసుకున్నాడు. ఈ విషయాన్ని కొందరు విద్యార్థులు గమనించడంతో అతడి రాసలీలల బాగోతం వెలుగులోకి వచ్చింద. Also Read: లండన్‌‌కు చెందిన మైఖేల్ అనే వ్యక్తి ఓ యూనివర్శిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. తన దగ్గర రీసెర్చ్ స్కాలర్‌గా ఉంటున్న సోఫియా అనే యువతిపై కన్నేశాడు. ఆమెను చాలాకాలంగా లైంగికంగా వేధిస్తూ కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. ప్రొఫెసర్ బెదిరింపులకు సోఫియా లొంగిపోయి అతడితో లైంగిక సంబంధం పెట్టుకుంది. మైఖేల్ యూనివర్శిటీలో తన ఛాంబర్‌నే కామక్రీడలకు వేదిక చేసుకున్నాడు. ఎవరూ లేని సమయంలో సోఫియాతో అక్కడే శృంగారం చేసేవాడు. Also Read: గతవారం యూనివర్శిటీకి సెలవులు రావడంతో స్టూడెంట్స్ అంతా ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ సమయంలో సోఫియాను లైబ్రరీకి రావాలని ఆదేశించాడు. మైఖేల్ చెప్పినట్లుగా అక్కడికి వెళ్లిన ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. లైబ్రరీలో పాడుపనులు వద్దని ఆమె వారించినా ప్రొఫెసర్ పట్టించుకోలేదు. తనతో సెక్స్‌లో పాల్గొనకపోతే భవిష్యత్ నాశనం చేస్తానని హెచ్చరించాడు. దీంతో సోఫియా అయిష్టంగానే అక్కడ శృంగారానికి ఒప్పుకుంది. Also Read: వారిద్దరూ లైబ్రరీలో ఉన్నామన్న సంగతి మరిచి రాసలీల్లో ముగిసిన సమయంలో అక్కడికి వచ్చిన కొందరు స్టూడెంట్స్ వారి బాగోతాన్ని చూసి షాకయ్యారు. వెంటనే యూనివర్శిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన యాజమాన్యం ప్రొఫెసర్‌ మైఖేల్‌ను విధుల నుంచి తప్పించింది. అతడు తనను బెదిరించి లైంగికంగా దోచుకున్నాడని సోఫియా చెప్పడంతో పోలీసులు మైఖేల్‌ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉంటూ మైఖేల్ చేసిన పాడుపని అక్కడ చర్చనీయాంశంగా మారింది. Also Read:


By October 30, 2019 at 10:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/university-professor-arrested-for-sexual-affair-with-student-in-london/articleshow/71814486.cms

No comments