Breaking News

Kerala: ప్రేమను తిరస్కరించిందని బాలిక సజీవ దహనం


బాలిక తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఓ యువకుడు ఉన్మాదిలా మారిపోయాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో ఆమె కాలిపోతుంటే కౌగిలించుకుని తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. Also Read: కేరళలోని కొచ్చి ప్రాంతానికి చెందిన దేవిక అనే బాలిక(17) ఇంటర్మీడియట్ చదువుతోంది. అదే ప్రాంతంలో నివసించే మిథున్ అనే యువకుడు ప్రేమ పేరుతో కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. చాలాసార్లు ప్రేమ ప్రస్తావన తెచ్చినా దేవిక పట్టించుకోకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కని అమ్మాయి ఎవరికీ దక్కకూడదని నిర్ణయించుకున్నాడు. బుధవారం బైక్‌పై దేవిక ఇంటి వద్దకు చేరుకున్న మిథున్ కాలింగ్ బెల్ కొట్టాడు. దేవిక తలుపు తీయడంతో వెంటనే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అతడిని అడ్డుకునే క్రమంతో దేవిక తండ్రికి గాయాలయ్యాయి. Also Read: మంటల్లో కాలిపోతున్న దేవికను మిథున్ కౌగిలించుకోవడంతో అతడికి కూడా తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ దేవిక, మిథున్ ప్రాణాలు కోల్పోయారు. దేవిక తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By October 11, 2019 at 08:32AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kerala-teen-set-on-fire-for-refusing-love-proposal/articleshow/71533087.cms

No comments