Hyderabad: సంసార జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి చేసుకున్న ఘటన మాదన్నపేట పరిధిలో సోమవారం జరిగింది. మాదన్నపేటలో నివాసముండే సాయి శంకర్(32) అనే వ్యక్తి గచ్చిబౌలిలోని హెచ్ఎస్‌బీసీ బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతడికి నాలుగేళ్ల క్రితం ప్రసన్న అనే యువతితో వివాహం జరిగింది. Also Read: పెళ్లయిన తొలినాళ్ల నుంచే దంపతుల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇద్దరూ తరుచూ గొడవ పడుతూ ఉండేవారు. దీనిపై పెద్దల మధ్య పంచాయతీ జరిగినా కాపురంలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో సాయిశంకర్ సంసార జీవితంపై విసిగిపోయాడు. Also Read: దసరా పండుగ సందర్భంగా ప్రసన్న సోమవారం ఉదయం పుట్టింటికి వెళ్లింది. 10 గంటల సమయంలో సాయిశంకర్ బెడ్‌రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య సమాచారం అతడి భార్య ప్రసన్నకు అందించారు. మంచి ఉద్యోగం, ఐదెంకెల జీతం సంపాదిస్తున్నా సాయి శంకర్ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకోవడం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. Also Read:
By October 08, 2019 at 07:06AM
No comments