Breaking News

Hyderabad: పంజాగుట్టలో పట్టపగలే దారుణహత్య..


హైదరాబాద్‌లో ఆదివారం దారుణం జరిగింది. నగరంలో కీలక ప్రాంతమైన పంజాగుట్టలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం కొందరు దుండగులు ఓ వ్యక్తిని నడిరోడ్డుపై వెంబడిస్తూ కత్తులతో కిరాతకంగా నరికేశారు. తీవ్ర రక్తస్రావంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. Also Read: ఈ ఘటన పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే జరగడం గమనార్హం. నడిరోడ్డుపై ఓ వ్యక్తి పరుగులు తీయడం వెనుకాల కొందరు కత్తులతో వెంబడించడం చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సినీఫక్కీలో జరిగిన ఈ మర్డర్ పోలీసులకు సవాల్‌గా మారింది. సంఘటనా స్థలంలో డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేసిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. Also Read: మృతుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో పంజాగుట్ట పరిధిలో నేరాల సంఖ్య పెరిగింది. ఈ ఏడాదిలోనే పంజాగుట్ట సర్కిల్‌లో ఓ ఆటో డ్రైవర్, విజయవాడకు చెందిన ఓ వ్యాపారి దారుణహత్యకు గురయ్యారు. తాజాగా జరిగిన హత్యతో పంజాగుట్ట మరోసారి ఉలిక్కిపడింది. Also Read:


By October 20, 2019 at 11:21AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-stabbed-to-death-near-panjagutta-in-hyderabad/articleshow/71671112.cms

No comments