Breaking News

పెళ్లిపేరుతో ఒకరిని లోబరుచుకుని.. మరో యువతితో ప్రేమాయణం


పెళ్లి పేరుతో ఓ యువతిపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. గండిపేటలోని ఓ రిసార్టులో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న యువతికి ఉప్పల్‌లోని పెట్రోల్ బంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న సాయినాథ్‌ అనే యువకుడితో ఏడాది క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. సాయినాథ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతి ఇంటికి కూడా వెళ్లి కుటుంబసభ్యులతో చనువుగా మెలిగాడు. Also Read: ఇటీవల యువతి పెళ్లి ప్రస్తావన తేవడంతో సాయినాథ్ తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో ఆమె కుటుంబసభ్యులు సాయినాథ్, అతడి సోదరుడిని పిలిచి హెచ్చరించగా మార్చి నెలలో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కొద్దిరోజుల క్రితం సాయినాథ్ పుట్టినరోజు కావడంతో ఆ యువతి అతడిని సర్‌ప్రైజ్ చేద్దామని ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో అతడు వేరే యువతితో చనువుగా ఉండటం చూసి షాకైంది. Also Read: దీనిపై సాయినాథ్‌ను నిలదీయగా అతడి సోదరుడు నచ్చజెప్పి పంపించాడు. అప్పటినుంచి సాయినాథ్ ఆ యువతి ఫోన్ నంబర్ బ్లాక్‌లో పెట్టేశాడు. దీంతో ఆమె సోమవారంఅతడి ఆఫీసుకు వెళ్లి నిలదీయగా.. నిన్ను పెళ్లి చేసుకోను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాయినాథ్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By October 24, 2019 at 09:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-man-arrested-for-rapes-woman-on-pretext-of-marriage/articleshow/71733215.cms

No comments