రెండో భర్త సాయంతో మొదటి భర్త దారుణహత్య

వేధింపులకు గురిచేస్తున్న మొదటి భర్తను రెండో భర్త సాయంతో మహిళ హతమార్చిన ఘటన జిల్లా చింతకొమ్మదిన్నె పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన లలితకు అదే ప్రాంతానికి చెందిన సంజీవ (26) అనే వ్యక్తితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. భర్త తాగుడుకు బానిసై తీవ్రంగా వేధిస్తుండటంతో లలిత రెండేళ్ల క్రితం అతడితో విడిపోయి బిడ్డతో సహా చిత్తూరు జిల్లా రేణిగుంటకు వెళ్లిపోయింది. Also Read: అక్కడ రమేష్ అనే యువకుడితో పరిచయం పెంచుకుని రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరు బిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. వారం రోజుల క్రితం రేణిగుంట రైల్వేస్టేషన్‌లో బిక్షాటన చేస్తున్న లలితను మొదటి భర్త సంజీవ చూసి షాకయ్యాడు. ఆమెను బలవంతంగా కడపకు తీసుకొచ్చి నిర్బంధించాడు. వారిని అనుసరిస్తూ రమేశ్ కూడా కడపకు చేరుకున్నాడు. సంజీవ బతికుంటే తామిద్దరం కలిసి బతకలేమని అనుకుని అతడి అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. Also Read: ఈ నెల 16వ తేదీన సంజీవ మద్యం తాగి పడుకున్న సమయంలో రమేష్ అతడి తలపై బండరాయితో మోది దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత లలితతో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By October 20, 2019 at 09:49AM
No comments