Breaking News

`సూపర్‌ మచ్చి` అంటున్న మెగాస్టార్ చిన్నల్లుడు


మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం అయిన ఈ జనరేషన్‌ యంగ్ హీరో కళ్యాణ్ దేవ్. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త ఈ కళ్యాణ్ దేవ్‌. గత ఏడాది ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కిన విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కళ్యాన్‌ దేవ్‌. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. లాంగ్‌ గ్యాప్‌ తరువాత మరో ఇంట్రస్టింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు కళ్యాణ్. పులి వాసు దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. దీపావళి కానుకగా టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్. జోరు వర్షంలో ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవుతున్న కళ్యాన్ లుక్‌ సూపర్బ్‌గా ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి కళ్యాణ్‌ దేవ్‌కు జోడిగా నటిస్తోంది. Also Read: సుమంత్‌ అశ్విన్‌ హీరోగా తెరకెక్కిన తూనీగ తూనీగ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన రియా చక్రవర్తి తరువాత బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారింది. దాదాపు ఏడేళ్ల తరువాత ఈ సినిమాతో రియా టాలీవుడ్‌ రీ ఎంట్రీ ఇస్తోంది. సీనియర్‌ నటులు రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌ వీకే, పోసాని కృష్ణమురళిలతో పాటు అజయ్‌, ప్రగతి, మహేష్‌, షరీఫ్, సత్యలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Also Read: ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు. శ్యామ్‌ కే నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈ సినిమాను రిజ్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన తిప్పరా మీసం సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read:


By October 26, 2019 at 11:32AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kalyaan-dhev-second-movie-first-look-and-title-announcement/articleshow/71771139.cms

No comments