Breaking News

పక్కింటోడి భార్యతో అక్రమ సంబంధం.. న్యాయవాది దారుణహత్య


తన భార్యతో పెట్టుకున్నాడన్న కక్షతో ఓ వ్యక్తి న్యాయవాదిని అతి కిరాతకంగా చంపేశాడు. అతడిని ఇంటి సమీపంలోనే ఖననం చేసి సాక్ష్యాధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించాడు. లాయర్ కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. Also Read: ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా అంబికాపూర్‌ సమీపంలోని లఖన్‌పూర్ పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో గల కోర్జా గ్రామానికి చెందిన బిలావర్ సింగ్(పేరు మార్చాం) అనే న్యాయవాది తన పక్కింట్లో ఉండే రామ్‌సింగ్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మహిళ భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియురాలితో రాసలీలలు కొనసాగించేవాడు. వీరి అనైతిక బంధం శ్రుతి మించడంతో మహిళ భర్తకు తెలిసిపోయింది. తన భార్యతో బంధం మానుకోవాలని అతడు న్యాయవాదిని హెచ్చరించినా పట్టించుకోలేదు. Also Read: దీంతో రామ్‌సింగ్ అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. గురువారం రాత్రి బిలావర్ సింగ్‌ను చంపేసి అతడి ఇంటి సమీపంలోనే గొయ్యి తీసి పూడ్చేశాడు. బిలావర్ సింగ్ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికిన కుటుంబసభ్యులకు ఇంటి ఆవరణలో రక్తపు మరకలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టగా బిలావర్ సింగ్‌కు రామ్‌సింగ్ భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో కేసును మరింత లోతుగా విచారించగా రామ్‌సింగే అతడిని చంపి పూడ్చి పెట్టినట్లు తెలిసింది. పోలీసులు రామ్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అతడు నేరం అంగీకరించాడు. Also Read:


By October 27, 2019 at 01:31PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/chhattisgarh-man-kills-lawyer-over-illicit-relationship-with-his-wife/articleshow/71783770.cms

No comments