Breaking News

బెజవాడకు భూకంప ముప్పు అధికం.. ముఖ్యంగా సిటీలోని ఈ ప్రాంతాల్లో..


ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య నగరమైన భూకంపం ముప్పు అధికంగా ఉన్న భారత నగరాల్లో ఒకటని ఓ అధ్యయంలో తేలింది. దేశంలో 50 నగరాలకు ఎక్కువగా ఉందని.. విజయవాడతోపాటు ఢిల్లీ, కోల్‌కతా, పుణే, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ తదితర 13 నగరాలకు ఇది మరీ ఎక్కువని ఈ అధ్యయనం తేల్చింది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ), భారత ప్రభుత్వం సంయుక్తంగా రూపొందించిన ఎర్త్‌క్వేక్ డిజాస్టర్ రిస్క్ ఇండెక్స్ రిపోర్టులో ఈ విషయాలను వెల్లడించాయని ‘ఈనాడు’ పేర్కొంది. భూకంప ముప్పు ఉన్న 50 నగరాల్లో.. 13 నగరాలు అధిక ప్రమాదకర స్థాయి కాగా.. 30 నగరాలకు ముప్పు మధ్యస్థంగా ఉంది. 7 నగరాలకు తక్కువ ప్రమాదకర స్థాయి ఉంది సదరు అధ్యయనం వెల్లడించింది. గతంలోనే వెల్లడి.. విజయవాడ, దాని చుట్టూ 150 కి.మీ. పరిధిలోని ప్రాంతం భూకంప జోన్‌లో ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలోనే వెల్లడించింది. 2015 నాటికి ఈ ప్రాంతంలో 150 వరకు భూప్రకంపనలు నమోదయ్యాయని తెలిపింది. ఇక్కడి నేలల స్వభావం కారణంగా భూకంపం ముప్పు ఎక్కువని స్పష్టం చేసింది. Read Also: విజయవాడ భూకంప ప్రభావ ప్రాంతాల్లో ఒకటని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ విద్యార్థులు 2015లో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. గుణదల, మొగల్రాజపురం, బందర్ రోడ్డు, కానూరు, పోరంకి, భవానీపురం, కొండపల్లి ప్రాంతాలు భూకంప జోన్‌లో ఉన్నాయని ఈ సర్వే తెలిపింది. విజయవాడ ప్రాంతం ఎత్తయిన భవనాల నిర్మాణానికి అనుకూలం కాదని ఆ అధ్యయనం వెల్లడించింది.


By October 15, 2019 at 08:50AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/50-indian-cities-in-seismic-zone-vijayawada-in-high-earthquake-zone/articleshow/71590477.cms

No comments