పొరబాటు నాదే.. సరిదిద్దుకుంటా.. వైఎస్ఆర్సీపీలో చేరిన జూపూడి, ఆకుల
విజయదశమి పర్వదినాన.. తమ రాజకీయ ప్రస్థానం కూడా విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ.. జనసేన, టీడీపీకి చెందిన నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇటీవలే జనసేనకు రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణతోపాటు టీడీపీకి గుడ్ బై చెప్పిన జగన్ సమక్షంలో అధికార పార్టీలో చేరారు. గతంలో నుంచి టీడీపీలోకి వెళ్లిన జూపూడి.. మళ్లీ సొంత గూటికి చేరారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ఆయన ప్రశంసలు గుప్పించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పై జూపూడి ఘాటైన విమర్శలు చేశారు. కానీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే వైఎస్ఆర్సీపీ నేతలతో మంతనాలు జరిపి ఆ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదుగురు దళితులకు జగన్ తన కేబినెట్‌లో స్థానం కల్పించారన్నారు. జగన్ పాలన ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. పొరపాట్లు తన వైపే ఉన్నాయని, సరిదిద్దుకుంటానని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో చేరిన మాట్లాడుతూ.. జగన్ పాలన భేషుగ్గా ఉందన్నారు. రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలు ఇదే అభిప్రాయంతో ఉన్నారన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆకుల.. 2019 ఎన్నికల ముందు జనసేనలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత ఆయన తిరిగి బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ జగన్ పార్టీ వైపు ఆయన మొగ్గు చూపారు. ఆకుల సత్యనారాయణకు జగన్ రాజమండ్రి రూరల్ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని సమాచారం. అక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఓడించే బాధ్యతలను ఆకులకు అప్పగించనున్నారని తెలుస్తోంది.
By October 08, 2019 at 12:44PM
No comments