Breaking News

బస్సులో ప్యాంట్ జిప్ విప్పి.. యువతిపై లైంగిక వేధింపులు


రద్దీగా ఉన్న బస్సులో ప్యాంట్ జిప్ విప్పి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ముంబయిలోని రద్దీగా ఉన్న బస్సులో ఓ మహిళ ఎక్కింది. కాసేపటి తర్వాత ఓ యువకుడు ఆమెను టచ్ చేయడం గమనించి హెచ్చరించింది. రద్దీగా ఉండటంతో నియంత్రించుకోవడం వీలు కావడం లేదని క్షమించాలని ఆ యువకుడు కోరడంతో ఆమె సరేనంది. Also Read: కాసేపటికి ఆ తర్వాత ఆమెపై పడిన యువకుడు భుజంపై చేయి వేసి అసభ్యంతా తాకాడు. తన ప్యాంట్ జిప్ తీసి అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె అతడిని చెంపపై ఒక్కటిచ్చింది. విషయం తెలుసుకున్న మిగిలిన ప్రయాణికులు కూడా ఆ యువకుడిని చితకబాదారు. డ్రైవర్ బస్సును మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడంతో నిందితుడిని పోలీసులకు అప్పగించారు. Also Read: నిందితుడిని చెంబూర్‌కు చెందిన రాజేంద్ర పాటిల్‌గా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ముంబయి సిటీ బస్సుల్లో మహిళలకు రక్షణ కరువైందని పలువురు విమర్శిస్తున్నారు. Also Read:


By October 08, 2019 at 12:54PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mumbai-man-unzips-touches-woman-private-parts-in-bus-held/articleshow/71488694.cms

No comments