Breaking News

విశాఖ జిల్లాలో విరిగిన రైలు పట్టా.. రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్


జిల్లా కసింకోట మండలంలోని బయ్యవరం-పరవాడపాలెం మధ్య రైలు పట్టా విరిగింది. రైలు పట్టా విరగడం గమనించిన స్థానికులు వెంటనే గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. సకాలంలో అధికారులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. పట్టా విరగడంతో విజయవాడ-విశాఖ నగరాల మధ్య నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైళ్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో పండుగ రోజున జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైలు పట్టా విరిగిన సంగతి తెలుసుకున్న అధికారులు.. వెంటనే పట్టా విరిగిన చోటుకు చేరుకొని సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు ప్రారంభించారు. దువ్వాడలో జన్మభూమి, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. పట్టా విరిగిన ఎఫెక్ట్ దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లపై కూడా పడింది. పలు రైళ్లు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నానికి పట్టాలను సరిచేస్తామని అధికారులు తెలిపారు.


By October 08, 2019 at 09:41AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/railway-track-breaks-in-kasimkota-of-visakhapatnam-district/articleshow/71486939.cms

No comments