భర్తతో నడుచుకుంటూ వెళ్తున్న మహిళను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాల విషయంలో మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతోంది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్నప్పటికీ అక్కడ నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా భర్త, కుమార్తెతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ముగ్గురు దుండగులు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని ముర్తాల్‌కు చెందిన ఓ మహిళ గురువారం రాత్రి భర్త, కుమార్తెతో కలిసి బయటకు వెళ్లింది. ఓ దాబాలో భోజనం చేసి ఇంటికి వెళ్తుండగా వారి బైక్ హఠాత్తుగా ఆగిపోయింది. రాత్రివేళ కావడంతో మెకానిల్‌లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆ కుటుంబం రోడ్డు పక్కనే నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో వారికి సమీపంలో ఓ ట్రక్కు ఆగింది. అందులో నుంచి కిందికి దిగిన ముగ్గురు వ్యక్తులు ఏం జరిగిందని వారిని అడిగారు. భర్త సమాధానం చెబుతుండగా అతడిని కొట్టి మహిళను ఎత్తుకెళ్లి ట్రక్కులో పడేశారు. తనను వదిలేయాలని ఆమె ఎంతగా వేడుకున్నా వారు వదిలిపెట్టలేదు. కామంతో రగిలిపోయిన మానవ మృగాలు ఒకరి తర్వాత ఒకరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ట్రక్కును బల్లాబ్‌గర్ వైపు మళ్లిస్తూ కొంత సమయానికి మళ్లీ అందరూ కలిసి ఆమెపై చేశారు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు. ఈలోగా భార్యను వెతుక్కుంటూ వచ్చిన భర్త ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాడు. ఆమె తేరుకున్నాక ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ తెలివిగా ఆలోచించిన బాధితురాలు ట్రక్కు నంబర్ గుర్తు పెట్టుకుని పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు నిందితులందరినీ రెండ్రోజుల్లోనే పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.
By October 11, 2019 at 08:43AM
No comments