ఒంటరిగా ఉన్న పనిమనిషిపై గ్యాంగ్ రేప్, హత్య

కర్ణాటకలోని బొమ్మనహళ్లి నగరంలో దారుణం జరిగింది. ఓ ఇంట్లోకి ప్రవేశించిన కొందరు దుండగులు మహిళపై సామూహిక అత్యాచారం చేసి చంపేసి పరారయ్యారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన సునతి దాస్ అనే మహిళ(35) కొన్నాళ్ల క్రితం బొమ్మనహళ్లి వలస వచ్చింది. సూర్యసిటీలోని అద్దె ఇంట్లో ఉంటూ సమీపంలోని ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవిస్తోంది. Also Read: సునతి ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకుని తలుపులు తెరిచి లోనికి వెళ్లగా సునతి దాస్ నగ్నంగా రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. హత్యకు ముందు ఆమెపై పలుమార్లు అత్యాచారం జరిగినట్లు నివేదికలో తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: ఈ హత్యకు పాల్పడింది దోపిడీ దొంగలా? లేక తెలిసిన వారి పనేనా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సునతి దాస్ ఒంటరిగా ఉంటుందన్న విషయం తెలుసుకునే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. Also Read:
By October 18, 2019 at 11:35AM
No comments