Breaking News

Amalapuram: బాలికను కిడ్నాప్ చేసి 23రోజుల పాటు అత్యాచారం


తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో 16ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పి.గన్నవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. రోజూ అమలాపురంలోని కాలేజీకి వెళ్లి వస్తుంటుంది. Also Read: ఈ క్రమంలోనే అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన తాడి రమేష్(21) అనే యువకుడు బాలికపై కన్నేశాడు. కొద్దిరోజుల పాటు ఆమె కాలేజీ వద్ద రెక్కీ నిర్వహించాడు. ఆగస్టు 30వ తేదీన సాయంత్రం కాలేజీ నుంచి బయటకు వచ్చిన బాలికను మాటల్లో దించి తనతో పాటు బైక్‌పై తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. 23రోజుల పాటు అమెను నిర్బంధించి రోజూ అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. బాలిక కనిపించకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో తల్లిదండ్రులు ఆరా తీశారు. ఆమె ఆచూకీ ఎక్కడా లభ్యం కాకపోవడంతో సెప్టెంబర్ 5న పి.గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం తీవ్రంగా గాలించారు. ఆమె కిడ్నాప్‌కు గురైనట్లు తెలుసుకుని సెప్టెంబర్ 21న వెతికి పట్టుకున్నారు. ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన రమేష్‌ను ఆదివారం(అక్టోబర్ 6) అరెస్ట్ చేశారు. కొత్తపేట న్యాయస్థానం అతడికి 14రోజుల పాటు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌జైలుకు తరలించారు. Also Read: Also Read:


By October 08, 2019 at 08:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-arrested-for-girl-kidnping-rape-in-amalapuram/articleshow/71486282.cms

No comments