అందంగా ఉందని చెల్లిపై అసూయ.. కత్తితో 190సార్లు పొడిచి చంపేసిన అక్క

అసూయ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. చెల్లి తన కంటే అందంగా ఉండటంతో అందరూ ఆమెతోనే మాట్లాడుతున్నారని, తనను పట్టించుకోవడం లేదన్న అక్కసుతో ఆమె ప్రాణం తీసేసిందో యువతి. కత్తితో ఏకంగా 190సార్లు పొడిచి దారుణంగా చంపేసింది. ఇంత దారుణంగా హత్య చేసిన యువతికి కోర్టు 13ఏళ్ల జైలుశిక్ష విధించింది. Also Read: రష్యాలోని మాస్కోకు చెందిన ఎలిజవేటా డుబ్రోవినా(22), స్టెఫానియా డుబ్రోవినా(17) అక్కాచెల్లెళ్లు. అందగత్తె అయిన స్టెఫానియా మోడల్‌గా రాణిస్తోంది. తన ఫోటోలు తరుచూ సోషల్‌మీడియాలో పోస్టు చేస్తూ చాలామంది ఫాలోవర్లను పెంచుకుంది. అయితే ఆమె అక్క ఎలిజవేటా అంత అందంగా ఉండదు. దీంతో ఆమె తన చెల్లెలిపై అసూయ పెంచుకుంది. Also Read: చెల్లి కారణంగా ఎవరూ తనతో మాట్లాడటం లేదని, అందువల్ల ఆమెను చంపేయాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం 2016లో చెల్లెలిని అతి కిరాతకంగా చంపేసింది. శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో కత్తితో పొడిచింది. కనుగుడ్లు పెకిలించడంతో పాటు ఓ చెవిని కూడా కోసేసింది. తీవ్ర రక్తస్రావంతో స్టెఫానియా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. Also Read: అదే సమయంలో వారింటికి వచ్చిన స్టెఫానియా బాయ్‌ఫ్రెండ్ అలెక్సీ తన ప్రేయసిని చూసి షాకయ్యాడు. మృతదేహం పక్కన కత్తితో ఉన్న ఎలిజవేటాను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. మూడేళ్ల పాటు విచారణ సాగిన ఈ కేసులో ఎలిజవేటా పథకం ప్రకారమే స్టెఫానియాను హత్య చేసినట్లు కోర్టు తేల్చింది. స్టెఫానియాను ఆమె అక్క ఏకంగా 190 సార్లు కత్తితో పొడిచినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొనడంపై న్యాయమూర్తి షాక్‌కు గురయ్యారు. దీంతో డుబ్రోవినాకు 13ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. Also Read:
By October 25, 2019 at 10:36AM
No comments