Breaking News

మహాత్ముడి 150వ జయంతి.. ప్రధాని మోదీ ఘన నివాళి


జాతిపిత మహాత్మా వేడుకలు యావత్తు భారతావనిలో ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర పోరాటంలో ఆయన చూపిన మార్గం, సేవలు, ఆశయాలను స్మరించుకుంటున్నారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. నేడు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా కావడంతో విజయ్‌ఘాట్ వద్ద ఆయనకు మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. ఇక, పలువురు రాజకీయ ప్రముఖులు సైతం మహాత్మునికి నివాళులర్పించారు. జాతిపితకు నివాళులర్పించిన వారిలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అనిల్‌ శాస్త్రి, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ.నడ్డా తదితరులు ఉన్నారు. సత్యం, అహింసలే ప్రధాన ఆయుధాలుగా చేసుకుని రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ శకం ప్రారంభమయ్యాక ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్, (లాల్ బాల్ పాల్) విదేశీవస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే, అరబిందో ఘోష్ వంటివారు తీవ్రవాద మార్గాలను అనుసరించారు. జాతీయోద్యమ తొలి దశలో సాయుధ విప్లవ పోరాటాలు ప్రారంభమయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయులు ప్రారంభించిన గద్దర్ పార్టీ సహకారంతో జరిగిన సంఘటిత సిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన మౌలిక మార్పు. అయితే, జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్ మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాలలో ఉద్యమించింది. ప్రముఖ విద్యావేత్త రంగీ సింగ్.. మహాత్మా గాంధీని 20వ శతాబ్దంలో అవతరించిన బోధిసత్వునిగా కీర్తించాడు. దేశ స్వాతంత్ర్య సంగ్రామ సారథిగా జనసంద్రాన్ని కదిలించిన మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతిపిత జయంతి ఉత్సవాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.


By October 02, 2019 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/prime-minister-narendra-modi-pays-tribute-to-father-of-nation-mahatma-gandhi/articleshow/71402700.cms

No comments