Breaking News

Hyderabad: ఒడిశా మహిళపై గ్యాంగ్‌రేప్.. నిందితులపై పీడీ చట్టం


హైదరాబాద్‌లో ఒడిశా జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు నిందితులపై పీడీ చట్టం ప్రయోగించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నిందితుల నేర చరిత్ర ఆధారంగా వారు మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశముందన్న అనుమానంతో వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు పోలీసులు చెబుతున్నారు. Also Read: ఒడిశాలోని బలంగీర్ జిల్లాకు చెందిన బాధితురాలు (30) జీవనోపాధి కోసం తన భర్త, రెండేళ్ల కుమారుడితో కలిసి నగరానికి వచ్చింది. నగర శివార్లలోని మహేశ్వరం మండలం నాగుల దోని తండాలోని ఇటుక బట్టిలో భర్తతో కలిసి పనిచేస్తోంది. అదే జిల్లాకు చెందిన నలుగురు యువకులు రాహుల్‌ మాజీ(25), మనోజ్‌ సమారత్‌(23), దుర్గా సమారత్‌(20), దయా మాజీ(20) జూన్ నెలలో అక్కడే పనికి కుదిరారు. Also Read: ఆగస్టు 16వ తేదీన రాత్రి 8 గంటల ప్రాంతంలో వివాహిత బహిర్భూమికి వెళ్లగా, అప్పటికే కాచుకుని ఉన్న ఈ నలుగురు యువకులు ఆమెను వెంబడిచారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యం గురించి బాధిత మహిళ తన భర్తకు చెప్పడంతో అతడు ఇటుక బట్టీ యజమానికి తెలియజేశారు. బాధితుల ఫిర్యాదుతో మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆగస్టు 22వ తేదీన నిందితులను అరెస్ట్ చేశారు. Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.


By October 02, 2019 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rachakonda-police-implementation-of-pd-act-on-odisha-woman-gang-rape-offenders/articleshow/71402674.cms

No comments