Breaking News

రూ.100లు ఎక్కువ అడిగిందని సెక్స్ వర్క్‌ర్‌ని పొడిచి చంపేశాడు


వ్యభిచారానికి ప్రసిద్ధి చెందిన ముంబయిలోని కామాటిపుర ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శారీరక సుఖం అందించేందుకు ముందుగా మాట్లాడుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు అడిగిందన్న కోపంతో ఓ వ్యక్తి సెక్స్ వర్కర్‌ని దారుణంగా చంపేశాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. Also Read: ముంబయిలోని నాయ్‌గావ్ ప్రాంతానికి చెందిన జితేంద్ర కుమార్ సింగ్(28) అనే వ్యక్తి కేటరింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. అతడికి తరుచూ కామాటిపురలోని రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లి సెక్స్ వర్కర్లతో శారీరక వాంఛలు తీర్చుకుంటుంటాడు. ఇదే క్రమంలో ఈ నెల 13వ తేదీన వ్యభిచార గృహానికి వెళ్లి ఓ మహిళను బేరం మాట్లాడుకున్నాడు. పని పూర్తయ్యాక ఆమె ముందుగా అనుకున్న దానికంటే రూ.100లు ఎక్కువ డబ్బులు అడిగింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. Also Read: మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. తనను వదిలేయాలని వేడుకుంటున్నా పట్టించుకోకుండా విచక్షణా రహితంగా 30సార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ కిరాతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సెక్స్ వర్కర్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి ఈ నెల 19వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఈ ఘటనతో రెడ్‌లైట్ ఏరియాలోని సెక్స్ వర్కర్లు విటులను చూస్తూనే వణికిపోతున్నారు. Also Read:


By October 15, 2019 at 09:20AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-stabs-sex-worker-to-death-in-mumbaim-arrested/articleshow/71590603.cms

No comments