Vijayawada: ఇంట్లోకి చొరబడి నర్సుపై అత్యాచారం

నగరంలో నర్సుపై ఓ కారు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చేసిన తర్వాత నిందితుడు వేధింపులు తీవ్రం కావడంతో బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. Also Read: కృష్ణా జిల్లా మొవ్వ గ్రామానికి చెందిన ఓ యువతి విజయవాడలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. తన అన్నయ్యతో కలిసి గుణదలలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తోంది. అదే ప్రాంతంలో నివసించే వినోద్ అనే కారు డ్రైవర్ ఆమెపై కన్నేశాడు. ఆగస్టు 4వ తేదీన యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడిన అతడు ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: ఈ విషయం ఎవరికైనా చెబితే మీ అన్నయ్యను చంపేస్తానని వినోద్ బెదిరించడంతో బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇటీవల వినోద్ కోరిక తీర్చాలని మళ్లీ ఆమెను వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైంది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఎవరికీ చెప్పలేక, వినోద్ వేధింపులు భరించలేదు ఈ నెల 26వ తేదీన ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను కాపాడిన స్థానికులు ఏం జరిగిందని నిలదీయగా విషయం చెప్పింది. వారి సాయంతో బాధితురాలు ఆదివారం మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.
By September 30, 2019 at 08:43AM
No comments