Breaking News

పెళ్లి కాకుండానే తల్లయింది.. కానీ బిడ్డను వద్దనుకుంది


పెళ్లి కాకుండానే గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చిందో 18ఏళ్ల యువతి. అయితే ఆ బిడ్డ తనకు వద్దని చెప్పడంతో డాక్టర్లు ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని ఫరీద్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. Also Read: శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఫరీద్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఓ యువతి నిండు గర్భంతో వచ్చింది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెకు డాక్టర్లు ప్రసవం చేశారు. తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు. అయితే నవజాత శిశువును ఆమెకు అప్పగించగా తీసుకునేందుకు నిరాకరించింది. తనకు ఇంకా పెళ్లి కాలేదని, వయస్సు కూడా 18ఏళ్లు నిండలేదని డాక్టర్లకు చెప్పింది. బిడ్డను తాను స్వీకరించే పరిస్థితి లేదని, ఎవరికైనా ఇచ్చేయాలని కోరడంతో పోలీసులు చైల్డ్ లైన్ ఫౌండేషన్ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. Also Read: దీంతో వారు ఆస్పత్రికి వచ్చి బిడ్డను స్వీకరించాల్సిందిగా యువతికి సలహా ఇచ్చినా ఆమె పట్టించుకోలేదు. దీంతో వారు సెంటర్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్య్లూసీ), సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలల సంక్షేమ కమిటీ యువతి సోమవారం యువతి నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాత అధికారులు దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. Also Read: పెళ్లి కాకుండానే బిడ్డను కనడంతో గ్రామంలో పరువు పోతుందన్న భయంతోనే బిడ్డను తీసుకునేందుకు తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై హెల్త్ సెంటర్ ఇన్‌ఛార్జి జసిత్ అలీ మాట్లాడుతూ.. బాలికను చూసేందుకు ఆస్పత్రికి వచ్చి ఆమె తండ్రి బిడ్డను వదిలేసి రావాలని కోరడంతోనే ఆమె ఇలా చేస్తోందని తెలిపారు. బిడ్డను చూడటానికి కూడా ఆమె అంగీకరించడం లేదని, నర్సులే బిడ్డను సాకుతున్నారని తెలిపారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత తల్లిని డిశ్చార్జ్ చేస్తామన్నారు. తమ కూతురు గర్భంతో ఉందన్న విషయం బిడ్డను కనేంత వరకు తెలీదని ఆమె తండ్రి చెబుతుండటం గమనార్హం. అన్ని సంప్రదింపుల తర్వాత కూడా బిడ్డను స్వీకరించేందుకు తల్లి అంగీకరించకపోతే సంక్షేమ కేంద్రానికి తరలిస్తామని, రెండు నెలల తర్వాత ఎవరైనా దత్తత తీసుకునేందుకు అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. Also Read:


By September 30, 2019 at 08:26AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/up-girl-gives-birth-to-baby-but-resuses-to-accept-her/articleshow/71367677.cms

No comments