పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. లేడీ కానిస్టేబుల్‌పై ఎస్ఐ అత్యాచారం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళా కానిస్టేబుల్‌పై ట్రైనీ ఎస్ఐ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మహిళా పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న లేడీ కానిస్టేబుల్(30)తో ఓ ట్రైనీ ఎస్ఐకి సోషల్‌మీడియా ద్వారా పరిచయమైంది. ఆమె ఆహ్వానంతో జులై 7వ తేదీన ఎస్ఐ కానిస్టేబుల్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో మరెవరూ లేకపోవడంతో ఆమెను లోబరుచుకునేందుకు ప్రయత్నించాడు. Also Read: ఆమె తిరస్కరించడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక కోరిక తీర్చుకున్నాడు. ఇలా రెండు నెలలుగా వారిద్దరి మధ్య లైంగిక సంబంధం కొనసాగుతోంది. ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఆమె కోరుతున్నా పట్టించుకోకపోవడంతో హజారీబాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ట్రైనీ ఎస్ఐ తనను నమ్మించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. డిపార్ట్మెంట్కు చెందిన వ్యవహారం కావడంతో ఎస్పీ మయూర్ పటేల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. Also Read: కోర్టు ఆదేశాల ప్రకారం.. ట్రైనీ ఎస్ఐపై పోలీసులు ఐపీసీ 376() సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత నిందితుడి అరెస్ట్‌పై నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.
By September 30, 2019 at 09:11AM
No comments