Valmiki: పవన్‌కి ‘వాల్మీకి’ బర్త్ డే విష్.. పోస్టర్ పవర్ ఫుల్
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి అసలైన పండుగ నేడు. తమ అభిమాన నాయకుడు, పవర్ స్టార్ 48 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సంబరాల్లో తేలుతున్నారు. ఇదే రోజు వినాయక చవితి పండుగ కూడా ఉండటంతో వారి ఆనందం రెట్టింపు అయ్యింది. దీంతో ఒకవైపు గణపతి పప్పా మోరియా అంటూనే.. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ సోషల్ మీడియాను శుభాకాంక్షలతో హీటెక్కిస్తున్నారు. Read Also: ఇక అభిమానులతో సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్‌కి బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాబాయ్ పవన్ కళ్యాణ్‌కి అదిరిపోయే బర్త్ డే ట్రీట్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాల్మీకి’ చిత్రంలోని డిఫరెంట్ లుక్‌ను పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసి పవన్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు. ఇక భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మరో పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌లతో భయానకంగా కనిపించిన వరుణ్ సందేశ్.. ఈ లుక్‌లో చాలా సాఫ్ట్‌గా కనిపించారు. ఈ చిత్రంలో కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నుంచి సినీ రచయితగా మారిన వ్యక్తి పాత్రలో నటిస్తుండగా.. ఆ లుక్‌ను రివీల్ చేశారు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం తమిళ ‘జిగర్తాండ’కు రీమేక్. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. మిక్కి జె.మేయర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
By September 02, 2019 at 09:42AM
No comments