నూజివీడు ట్రిపుల్ ఐటీలో విషాదం.. ఉరేసుకున్న విద్యార్థిని
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన ఆర్.భాగ్యలక్ష్మి(20) ఆదివారం మధ్యాహ్న సమయంలో కాలేజీ హాస్టల్ మూడో అంతస్తులో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించారు. డీఎస్పీ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి కాలేజీ క్యాంపస్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తొలి విద్యార్థులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భాగ్యలక్ష్మి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, సంఘటనా స్థలంలో ఎలాంటి లేఖ లభించలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రేమ వ్యవహారమా? లేక చదువు ఒత్తిడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
By September 02, 2019 at 09:37AM
No comments