ప్రియురాలు మోసం చేసిందని విషం తాగేశాడు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/70942444/photo-70942444.jpg)
ప్రియురాలు మోసం చేసిందన్న మనోవేదనతో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్‌లో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన మధు అనే యువకుడు స్థానికంగా నివసించే ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా ఓకే చెప్పేయడంతో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. Also Read: కొద్దిరోజుల తర్వాత ప్రేమికుల మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో మధుతో యువతి మాట్లాడటం మానేసింది. అయితే తనతో మాట్లాడాలని అతడు వేధించడంతో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: దీంతో ప్రియురాలు తనను మోసం చేసిందని ఆవేదన చెందిన మధు ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోనే పురుగులమందు తాగేశాడు. ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టడంతో గమనించిన బంధువుల, ఫ్రెండ్స్ వెంటనే మధు ఇంటికి చేరుకుని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మధు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. మధు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
By September 02, 2019 at 09:59AM
No comments