Breaking News

Tsr awards: టాలీవుడ్ హీరోలపై సుబ్బరామి రెడ్డి మండిపాటు


అవార్డ్ వేడుకలు నిర్వహించడంలో పెట్టింది పేరు సుబ్బరామి రెడ్డి. క్రమం తప్పకుండా ఏటా తన పుట్టినరోజున తెలుగు ఫిలిం టాలెంట్ అవార్డ్స్ పేరటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. కొత్తగా వెండితెరకు పరిచయం అవుతున్న సెలబ్రిటీలను ఆయన ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. అయితే అవార్డ్స్ వేడుకకు ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలు హాజరుకాకపోవడంపై ఆయన మండిపడ్డారు. 80ల కాలంలో ఏవన్నా అవార్డ్ వేడుకలు జరిగే ఎన్టీఆర్, ఏఎన్నార్ తప్పకుండా హాజరయ్యేవారని, కానీ ఇప్పుడున్న హీరోలకు వచ్చి అవార్డ్ కలెక్ట్ చేసుకోవడాన్ని కూడా తమ స్టేటస్ అడ్డొస్తుందని భావిస్తున్నారని అన్నారు. ‘చిత్ర పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ నటీనటులను సత్కరించడానికి నేను ఏటా అవార్డ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాను. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ ప్రతీ కార్యక్రమానికి హాజరయ్యేవారు. తమ టాలెంట్‌ను గుర్తించి అవార్డ్‌తో సత్కరిస్తున్నందుకు ఆనందించేవారు. కానీ ఈ తరం హీరోలు వేడుకకు హాజరై అవార్డ్ కలెక్ట్ చేసుకోవడానికి కూడా స్టేటస్ తగ్గిపోతుందని అనుకుంటున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను చూసి ఇప్పటి హీరోలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి’ అన్నారు. చెప్పాలంటే టాలీవుడ్‌కి చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు సైమా లాంటి వేడుకలకు కూడా హాజరు కారు. అదేమంటే తాము వరుస సినిమాలతో బిజీగా ఉన్నామని, డేట్లు కుదరడం లేదని అంటున్నారు. ఎన్ని సినిమాలు చేసినా ఎంత సంపాదించినా చివరికి అవార్డులే వారికి గుర్తింపు తెచ్చిపెడతాయని ఈ తరం నటులు ఎప్పుడు తెలుసుకుంటారో. అయితే టార్గెట్ చేస్తోంది ఎవరిని అన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా ఆయన బర్త్‌డేకు చాలా రోజులు ఉంది. అలాంటప్పుడు ఇప్పటినుంచే మీడియా ముందు పలువురు హీరోలకు ఎందుకు వార్నింగ్ కాల్ ఇచ్చినట్లు? బహుశా గతేడాది అవార్డ్ షోకు ట్రోఫీలు తీసుకోవడానికి హీరోలు వచ్చి ఉండరు. అందుకే ముందుగానే ఓ వార్నింగ్ ఇచ్చేస్తే ఈసారైనా తప్పకుండా వస్తారన్నది సుబ్బరామిరెడ్డి ఆలోచన అయివుండొచ్చు.


By September 04, 2019 at 11:10AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/businessman-and-politician-subbarami-reddy-fires-on-tollywood-heroes-for-not-attending-to-award-events/articleshow/70971941.cms

No comments