జగన్ సర్కారుపై కన్నా ఫైర్.. మతప్రచారకులకు గౌరవవేతనంగా ప్రజాధనమా?
వైఎస్ఆర్సీపీ సర్కారును పదే పదే టార్గెట్ చేస్తోన్న ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మరోసారి జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. అమరావతిపై క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసిన ఆయన.. తాజాగా మరో అంశంపై ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. క్రిస్టియన్ ఫాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం అందించాలని ఏపీ సర్కారు నిర్ణయించడాన్ని కన్నా విమర్శించారు. స్వప్రయోజనాలే లక్ష్యంగా జగన్ సర్కారు సమాజాన్ని, ప్రజలను మతపరంగా విభజిస్తోందని ఆరోపించారు. మతప్రచారకులకు ప్రజాధనాన్ని గౌరవవేతనం చెల్లించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఫాస్టర్లను గుర్తించేందుకు గ్రామవాలంటీర్లతో సర్వే చేయించడం చాలా దారుణం అని బీజేపీ నేత మండిపడ్డారు. ప్రజాస్వామ్య లౌకిక దేశంలో ప్రజాధనాన్ని మతపరంగా ఉపయోగించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. హిందూత్వ అజెండాతో ముందుకెళ్తోన్న బీజేపీ.. ఏపీలోనూ ఇదే అంశాన్ని హైలెట్‌గా చేసుకొని ఎదగాలని భావిస్తోంది. ఇటీవల అమెరికా వెళ్లిన జగన్ ఓ కార్యక్రమంలో జ్యోతిప్రజ్వలన చేయడానికి ఒప్పుకోలేదని.. దీనికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. అనంతరం వైఎస్ఆర్సీపీ ఈ విమర్శలకు తగిన సమాధానం ఇచ్చింది. Read Also:
By September 04, 2019 at 11:18AM
No comments