Sunitha Boya ఇవీ నువ్ చేసిన తప్పులు: బన్నీ వాసు స్ట్రాంగ్ కౌంటర్
మీడియాలో తనపై వస్తున్న కథనాలపై స్పందించారు మెగా ప్రొడ్యుసర్ . అనే క్యారక్టర్ ఆర్టిస్ట్ తనపై చేసిన ఆరోపణల్ని ఖండిస్తూ వీడియో విడుదల చేశారు బన్నీ వాసు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా సునీత బోయ విషయంలో చాలా మంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నా వైపు నుండి ఏం జరిగింది అన్నదానిపై క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో విడుదల చేస్తున్నా. Read Also: ఆ అమ్మాయి నేను జనసేనలో పనిచేస్తున్నా నాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అని మమ్మల్ని అప్రోజ్ అయ్యింది. మేం కూడా ఆమెకు ఏదైనా చూడమని మా గీతా ఆర్ట్స్ వాళ్లకు చెప్పాం. కాని ఇక్కడ సునీత బోయ తెలుసుకోవాల్సింది. నువ్ జనసేనలో పనిచేశావని క్యారెక్టర్ ఇవ్వమనడం కరెక్ట్ కాదు. మెగా హీరోలను అభిమానిస్తావు.. మీ నాన్న మాకు తెలిసిన థియేటర్స్‌లో పనిచేశారు కాబట్టి ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వమని చెప్పా. మా వాళ్లు కూడా నీకు ఆడిషన్స్ చేశారు. నువ్ వెళ్లావని చెప్పావు. ఆడిషన్స్‌కి వెళ్లి నువ్ పాస్ అయితే ఆ రోల్‌కి తీసుకుంటారు. నిన్ను తీసుకోకూడదని ఎక్కడా ఉండదు. నీపై అంత శ్రద్ధ కూడా పెట్టలేం మేం. మాకు వేరే పనులు ఉంటాయి. ఆడిషన్స్‌కి ఓ టైం ఉంటుంది ఆ టైంలో నువ్ వెళ్లాలి. కాని వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదు. గేట్ దగ్గరకు వచ్చేసి నాకు క్యారెక్టర్ ఎందుకు ఇవ్వరు అంటూ హల్ చల్ చేస్తే అవకాశం ఇవ్వలేం. Read Also: నువ్ మమ్మల్ని అప్రోజ్ అయ్యే విధానం బాలేదు. మొదట్లో మీరంటే అభిమానం అంటూ పోస్ట్‌లు పెట్టావు. అప్పుడు మేం నీకు మంచి చేయాలనే అనుకున్నాం. కాని తరువాత నీ అగ్రిసివ్‌తో మాకు అనుమానం ఏర్పడింది. ఈమెను లొకేషన్‌కి తీసుకువెళ్లినా ప్రశాంతంగా చేస్తుందా? అనే వర్రీలోకి మమ్మల్ని తోచేశావు. నువ్ ఓ మహిళవి. అది మరచి రాత్రి పూట వచ్చి గేట్ దగ్గర హడావిడి చేస్తే.. ఏం చేయాలో తెలియక పోలీస్ లకు సమాచారం ఇచ్చారు. నాకు పోలీసులు ఫోన్ చేస్తే.. ఆ అమ్మాయిని వదిలెయ్‌మని చెప్పా. నువ్ స్టేషన్‌లో అడుగు.. నేను కేసు ఫైల్ చేయొద్దని చెప్పా. ఆ మరునాడు ఉదయం నువ్ మా ఆఫీస్‌కి వెళ్లి అక్కడ కిచెన్‌లో కత్తి తీసుకుని నేను చచ్చిపోతున్నా అని ఫేస్ బుక్‌లైవ్ పెడితే మాకు కంగారు రాదా? అందుకే మేం మళ్లీ పోలీసుల్ని ఆశ్రయించాము. నీ బిహేవియర్ చూసి మాకు భయం వేసింది. అప్పుడు నిన్ను కూర్చోబెట్టి చెప్పాం. మమ్మల్ని డిస్ట్రబ్ చేయకు.. మా వాళ్లు ఏదైనా ఆడిషన్ ఉంటే చెప్తారు.. అప్పుడు వెళ్లు అని చెప్పాం. మా పేరెంట్స్‌గా బాలేదని అన్నావు. దానికి కూడా మేం సాయం చేస్తాం అని హామీ ఇచ్చాము. ఇంతలోనే 15 రోజులు కాగానే మీ నాన్నను తీసుకుని వచ్చి అనారోగ్యంతో ఉన్న ఆయన్ని మా గేటు దగ్గర వదిలిపెట్టేసి నువ్ వెలిపోయావ్. మాకు ఏం చేయాలో తెలియక మీ నాన్నను కారులో అనంతపురం తెలిసిన వ్యక్తి దగ్గరకు పంపించి చూసుకోమన్నాం. ఇదంతా మేం ఓపికతో చేస్తున్నాం. ఎందుకంటే నువ్ ఆడపిల్లవి. ఏదో ఇండస్ట్రీకి వచ్చింది.. కష్టపడుతుంది అనే అనుకున్నాం. కాని నువ్ సినిమాలో నటించాలి అంటే నీకో బ్యాలెన్స్ ఉండాలి. అదేం లేకుండా నువ్ ఇలాగే ప్రవర్తిస్తే.. నువ్ ఇంకో పది సంవత్సరాలైనా ఇలాగే ఉంటావు’ అంటూ కౌంటర్ ఇచ్చారు బన్సీ వాసు.
By September 06, 2019 at 10:19AM
No comments