Breaking News

Jabardasth: పవన్‌కి జబర్దస్త్ ఆది ‘హైపర్’ ట్వీట్.. మామూలుగా ఎత్తలేదుగా!


అవును.. అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటే పవన్‌కి మాత్రం భక్తులు ఉంటారు. ఈ భక్తుల్లో వీరభక్తులు చాలా మందే ఉంటారు. వారిలో ఎప్పుడూ ముందు వరసలో ఉండేది మాత్రం జబర్దస్త్ కమెడియన్, జనసైనికుడు . నేడు తన దేవుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా వరుస ట్వీట్లు చేసి తన హైపర్ చూపించాడు హైపర్ ఆది. నోరు తెరిస్తే.. పంచ్‌లు ప్రవాహంలో వచ్చే ఆదికి తన అభిమాన హీరో బర్త్ డే కావడంతో ఆయన్ని ఆకాశానికెత్తేశాడు. ‘భయం అన్నదే తెలియని దయామయుడు’ అంటూ ట్వీట్ వదిలిన ఆది.. పవన్‌పై ఉన్న అభిమానాన్ని మరో ట్వీట్‌లో పోస్ట్ చేశాడు. ‘ఏమని పిలవాలి ఎంతని చెప్పాలి. ఎంత చెప్పినా తక్కువే. ఎన్ని పేర్లతో పిలిచిన పవర్ పాస్ అయ్యే ప్లేస్ మాత్రం పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే.. హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్’ మీరు మాకు ‘బాస్, అన్నయ్య, జనసేనాని, రాయల్ బెంగాల్ టైగర్, క్రేజ్ కా బాబ్, పవర్ స్టార్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ‘రాసే కొద్దీ ఆయన గురించి రాయడానికి ఇంకా ఏదో మిగిలే ఉందనిపిస్తుంది. ఒక వ్యక్తిలో ఇన్ని గోల్డెన్ క్వాలిటీస్ దేవుడు లాంటి మనసు ఉన్న మనిషి’ పవన్ కళ్యాణ్ అంటూ ఆకాశానికెత్తేశారు హైపర్ ఆది. ప్రస్తుతం హైపర్ ఆది ట్వీస్ జనసైనికులకు విపరీతంగా నచ్చేయడంతో వైరల్ అవుతున్నాయి.


By September 02, 2019 at 02:16PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jabardasth-hyper-aadi-emotional-tweets-on-pawan-kalyan-birthday/articleshow/70945475.cms

No comments