అక్రమ సంబంధానికి అడ్డొస్తాడేమోనని కత్తితో దాడి.. ఒకరి మృతి
అక్రమ సంబంధానికి అడ్డొస్తాడేమోనని ఓ వ్యక్తి ఇద్దరిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన జిల్లా పినపాకలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... కరకగూడెం మండలం కౌలూరుకి చెందిన పర్శిక అర్జున్ అనే వ్యక్తికి గతంలో వివాహం కాగా విభేదాలతో ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో అర్జున్‌కి ఏర్పడింది. ఆ మహిళకు కూడా భర్త లేకపోవడంతో వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. ఆ మహిళకు సోదరుడైన మలకం లక్ష్మణ్ అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఇక్కడ ఒంటరిగా ఉండటమెందుకు తనతో వచ్చేయాలని లక్ష్మణ్ తన చెల్లిని తరుచూ కోరుతున్నాడు. ఆ మహిళ అన్న మాట విని వెళ్లిపోతే తమ బంధం కొనసాగదని భావించిన అర్జున్ లక్ష్మణ్‌పై కక్ష పెంచుకున్నాడు. ఆదివారం తన స్నేహితుడితో కలిసి చెల్లి ఇంటికి వచ్చిన లక్ష్మణ్ తిరిగి వెళ్తుండగా అర్జున్ అతడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. లక్ష్మణ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, అతడి స్నేహితుడు విజయ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లక్ష్మణ్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
By September 02, 2019 at 02:26PM
No comments