Breaking News

నా లైఫ్‌లో అదే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్.. పవన్ గురించి డైరెక్టర్ బాబీ


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పనిచేయాలని చాలా మంది దర్శకులకు కోరిక ఉంటుంది. కానీ, అందరికీ అది సాధ్యపడలేదు. ఇకపై సాధ్యపడుతుందో లేదో కూడా తెలీదు. అయితే, పవన్ కళ్యాణ్‌తో పనిచేసినప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేదో ఇప్పటికీ చాలా మంది దర్శకులు చెబుతూనే ఉంటారు. తాజాగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబీ) పవన్‌తో తన అనుభవం గురించి వెల్లడించారు. నేడు (సెప్టెంబర్ 2) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘ఆయనతో కలిసి పనిచేయాలనేది ప్రతి ఒక్కరి కల. భయమంటే ఏమిటో తెలియని వ్యక్తి, గొప్ప నాయకుడు. నిద్రలేచిన ప్రతిరోజూ మిమ్మల్ని సెట్స్‌లో చూడటమనేది నా జీవితంలోనే గొప్ప అనుభవం. మీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం సార్. ఇలాంటి రోజులు మీరు ఎన్నో జరుపుకోవాలి సార్. హ్యాపీ బర్త్‌ డే పవన్ కళ్యాణ్’ అని బాబీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈరోజు ట్విట్టర్ పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్‌తో మారుమోగిపోతోంది. జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, సినిమా పరిశ్రమకు చెందినవారు. రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే, పవన్ బర్త్‌ డే సందర్భంగా జనసేనకు విరాళాలు అందజేస్తున్నారు. ఇతర హీరోలకు చెందిన అభిమానులు కూడా జనసేనకు విరాళాలు అందజేస్తుండటం విశేషం. నేడు పవన్ కళ్యాణ్ 48వ ఏట అడుగుపెట్టారు.


By September 02, 2019 at 02:11PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/a-fearless-man-and-a-great-leader-director-bobby-praises-pawan-kalyan/articleshow/70945512.cms

No comments