కోరిక తీర్చాలంటూ లేడీ ప్రొఫెసర్‌కు వేధింపులు.. ఏపీ విద్యార్థి అరెస్ట్
కోరిక తీర్చాలంటూ మహిళా ప్రొఫెసర్‌నే వేధిస్తున్న ఏపీకి చెందిన విద్యార్థిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ పేరుతో ప్రొఫెసర్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఆ కామాంధుడు ఆమెను బెదిరించి నగ్నంగా వీడియో తీశాడు. దాన్ని అడ్డం పెట్టుకుని కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాడి ఆట కట్టించారు. Also Read: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివేశ్(23) అనే విద్యార్థి తమిళనాడులోని మహాబలిపురంలో గల ఓ ప్రైవేటు యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అదే యూనివర్శిటీలో ఏపీకే చెందిన ఓ యువతి(25) ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. ఒకే ప్రాంతం కావడం, వయసు రీత్యా పెద్దగా తేడా లేకపోవడంతో ఆమె వివేశ్‌తో స్నేహంగా ఉండేది. ఈ క్రమంలోనే చదువు పూర్తవుతున్నందున పార్టీ ఇస్తానని చెప్పి వివేశ్ ఈ నెల 19వ తేదీన ఆమెను బయటకు తీసుకెళ్లాడు. Also Read: రాత్రి 7గంటల సమయంలో ప్రొఫెసర్‌ను బైక్‌పై ఎక్కించుకుని ఈస్ట్‌కోస్ట్ రోడ్ వైపు తీసుకెళ్లి ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆపాడు. చుట్టుపక్కల చెట్లు పక్క మనిషి జాడే లేని ప్రాంతాన్ని చూసి ఆమె భయపడి ఇక్కడికెందుకు తీసుకొచ్చావ్ అంటూ నిలదీసింది. దగ్గర్లోనే ఓ రిసార్ట్ ఉందని, అక్కడే డిన్నర్ ఏర్పాటు చేశానని మాయమాటలు చెప్పాడు. కొంతదూరం నడిచాక కత్తితో ఆమెను బెదిరించాడు. దుస్తులన్నీ విప్పించి సెల్‌ఫోన్‌లో న్యూడ్ వీడియోలు తీశాడు. తర్వాత బైక్‌పై ఎక్కించుకుని హాస్టల్ వద్ద దించేసి.. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. Also Read: తర్వాతి రోజు నుంచే బాధితురాలికి ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. అతడికి లొంగితే తన జీవితం నాశనమవుతుందని భావించిన ఆ ప్రొఫెసర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం వివేశ్‌ను అరెస్ట్ చేశారు. అతడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని ఆ న్యూడ్ వీడియోను డిలీట్ చేశారు. Also Read:
By September 25, 2019 at 11:43AM
No comments