Breaking News

బాత్రూం వీడియోతోనే త్రిష.. నేనే హాటర్!!


టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎవర్ని కెలక్కుండా సైలెంట్‌గా ఉండలేదు.. కాదు కాదు అలా చేయకపోతే నిద్రరాదంతే. రోజూ ఎవర్నో ఒకరిని హీరోలను కానీ.. హీరోయిన్స్‌ను కానీ ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేస్తూ వారి గురించి ఏదో హాట్ కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇప్పటికే దాదాపు టాలీవుడ్‌లో అందరు హీరోయిన్స్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి అలియాస్ శ్రీ శక్తి.. తాజాగా త్రిషను టార్గెట్ చేసింది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతో టాటా చెప్పేసి కోలీవుడ్‌కు చెక్కేసిన ఈ హాట్ హాట్ భామ.. అక్కడ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా ఓ వెలుగు వెలుగుతున్న త్రిషను టార్గెట్ చేసింది. కోలీవుడ్‌లో ఆమె ప్లేస్‌ను కొట్టేయాలని కన్నుపడిందేమోకానీ.. ఆమెను బ్లేమ్ చేయడం మొదలెట్టింది. ఆమె వ్యక్తిగత వ్యక్తిగత విషయాలను సైతం శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

అప్పట్లో త్రిష బాత్రూమ్ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో గురించి శ్రీరెడ్డి మాట్లాడుతూ తన ఫేస్‌బుక్ వేదికగా హడావుడి చేసింది. ‘త్రిష బాత్ రూం వీడియో బయటకు వచ్చిన తరువాతే ఫేమస్ అయ్యింది. అసలు అక్కడ ఏం ఉంది?.. నేను కొంచెం ఎక్స్ పోజ్ చేసినా చాలు.. నాతో పోల్చుకుంటే త్రిష దగ్గర ఏం ఉంది. నేనే హాటర్’ అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేసింది. అంతటితో ఆగని శ్రీరెడ్డి.. తాను ఎక్స్ పోజ్ చేస్తూ కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ రచ్చరచ్చ చేసింది. తనపై విమర్శలు గుప్పిస్తున్న వారికోసమే ఇవని చెప్పుకొచ్చింది. మరి శ్రీరెడ్డి హాట్ కామెంట్స్‌పై త్రిష రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి.



By September 26, 2019 at 04:26AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47605/hotter.html

No comments