Breaking News

కొరటాల కూడా ‘సైరా’ రేంజ్‌లో ప్లానేశాడుగా!


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ రిలీజ్ తర్వాత.. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి చిత్రానికి సంబంధించి ఇప్పటికే దాదాపు కథ సిద్ధం చేసేసిన ఆయన.. మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్, మిగిలినా తారాగణంగా ఎవరెవర్ని ఎన్నుకోవాలనే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ‘సైరా’ షూటింగ్‌ను దగ్గరుండి చూసిన కొరటాల తాను కూడా అదే రేంజ్‌లో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నటీనటీమణులను తీసుకోవాలనే యోచనలో ఉన్నారట.

అంటే.. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేయాలని ముందుగానే ఫిక్స్ అయిన కొరటాల అదే రేంజ్‌లో బడ్జెట్, నటీనటుల ఎంపిక చేయనున్నారట. అందుకే హీరోయిన్ మొదలుకుని మ్యూజిక్ డైరెక్టర్, తారాగణం అన్నీ పెండింగ్‌లో పెట్టారని వార్తలు వినవస్తున్నాయి. అంతేకాదు.. అక్టోబర్-02న వస్తున్న ‘సైరా’ రిలీజ్ టాక్‌ను బట్టి నటీనటులను ఫిక్స్ చేయాలని కొరటాల భావిస్తున్నారట. మరి కొరటాల కొత్త ప్రయోగం ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.



By September 28, 2019 at 11:16PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47654/koratala-shiva.html

No comments