పిల్లల ముందే భర్తను కొట్టి చంపేసిన భార్య
కుటుంబ తగాదాలతో భర్తను దారుణంగా కొట్టి చంపేసిందో ఇల్లాలు. నాన్నను కొట్టొద్దమ్మా అంటూ పిల్లలు వేడుకున్నా పట్టించుకోకుండా భర్త ప్రాణం తీసింది. అడ్డొస్తే మిమ్మల్ని కూడా చంపేస్తానని తల్లి బెదిరించడంతో ఆ పిల్లలు అమాయకంగా చూస్తూ ఉండిపోయారు. ఓ పక్క తండ్రి మృతి, మరోపక్క హత్యకేసులో తల్లి జైలుకి వెళ్లడంతో ఆ పిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఆదివారం జరిగింది. Also Read: మండలంలోని కదింవనంలో విష్ణుమూర్తి(30), శారద దంపతులు ఇద్దరు కుమారులతో కలిసి నివాసముంటున్నారు. విష్ణుమూర్తి కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొద్దిరోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుటుంబపెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా కుదరలేదు. శనివారం రాత్రి ఓ విషయంలో గొడవ జరగడంతో శారద భర్తపై దాడికి పాల్పడింది. కళ్లల్లో కారం కొట్టి బండరాయితో తలపై కొట్టి చంపేసింది. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన పిల్లలు నాన్నను వదిలేయాలని వేడుకున్నా ఆ అమ్మ మనసు కరగలేదు. భర్త ప్రాణం పోయేంత వరకు కొడితేగానీ ఆమె ఆవేశం చల్లారలేదు. Also Read: మరోవైపు రాత్రి సమయంలో వీరి ఇంట్లో నుంచి కేకలు వినిపించినా రోజూ జరిగే గొడవే కదా అని చుట్టుపక్కల వారు పట్టించుకోలేదు. ఆదివారం ఉదయం ఆరుబయట విష్ణుమూర్తి నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి అతడి సోదరి కన్నీరుమున్నీరైంది. నాన్నను అమ్మే చంపేసిందని పిల్లలు చెప్పడంతో స్థానికులంతా శారద చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో శంషాబాద్ పోలీసులు గ్రామానికి చేరుకుని శారదను అరెస్ట్ చేశారు. ఆమె పెద్ద కుమారుడు(8) జరిగిన ఘటనంతా పోలీసులకు చెప్పడంతో శారదపై హత్యకేసు నమోదుచేసి జైలుకు తరలించారు. ఆవేశంలో శారద చేసిన పనితో ఆ చిన్నారులిద్దరూ అనాథలయ్యారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Also Read:
By September 16, 2019 at 09:48AM
No comments