లడఖ్‌లోకి చొచ్చుకొచ్చిన డ్రాగన్ సైన్యం.. సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత
సరిహద్దుల్లో మరోసారి , చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి. భారత్, చైనాల మధ్య దాదాపు మూడు నెలలు డోక్లాం వివాదం కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా, తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత్, చైనా సైన్యం మధ్య వివాదం నెలకుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో వచ్చే నెలలో ఇంటిగ్రేటెడ్ పోరాట సమూహాం (ఐబీజీ) నైపుణ్యాల ప్రదర్శనకు భారత సైన్యం సిద్ధపడుతోన్న తరుణంలో లడఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. లడఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలో భారత్, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలోని రెండొంతల భాగాన్ని చైనా ఇప్పటికే ఆక్రమించుకోగా, మిగతా ప్రదేశంలోకి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చొరబడింది. దీంతో తీవ్రంగా స్పందించిన భారత సైన్యం తమ భూభాగంలోకి చొరబడిన వారిని అడ్డుకుంది. ఈ సందర్భంగా ఇరు సైన్యాల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయని, సాయంత్రం వరకు ఇది కొనసాగిందని తెలిపాయి. అయితే, బ్రిగేడియర్ స్థాయి అధికార ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలతో ఈ వివాదం ముగిసిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇరు వర్గాలు వెనక్కు వెళ్లేందుకు అంగీకరించాయని పేర్కొన్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఓసీ)పై భిన్నమైన వాదనల వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఇవి సాధారణంగా సరిహద్దుల్లోని సిబ్బంది సమావేశాలు ద్వారా పరిష్కరించబడతాయని ఆర్మీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. గతంలోనూ ఈ ప్రాంతంలో భారత, చైనా సైన్యం మధ్య ఘర్షణ నెలకుందని, 2017 ఆగస్టు 15న ఇరువురూ పరస్పరం దాడులకు పాల్పడినట్టు తెలియజేశారు. డోక్లామ్ వివాదం నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ‘హిమ విజయ్’ పేరుతో అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత సైన్యం ఐబీజీ నిర్వహించే సమయంలో చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్ భారత పర్యటనకు రానున్నారు. తొలిసారి మోదీ, జిన్‌పింగ్‌లు 2018 ఏప్రిల్‌లో యుహూన్‌లో భేటీ అయ్యారు. డోక్లాం వివాదం తర్వాత ఇరువురు నేతలు భేటీ కావడం అదే తొలిసారి. సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయానికి వచ్చారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో నిర్వహించే హిమ్ విజయ్ గురించి భారత్ సమాచారం ఇవ్వలేదని, ఎందుకంటే ఈ ప్రాంతం వారి సరిహద్దుకు సమీపంలో లేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. మూడు ఐబీజీల్లో మొత్తం 15,000 మంది సైనికులు 17 పర్వతాల వద్ద మోహరిస్తారు. పర్వత సానువుల్లో యుద్ధ నైపుణ్యాలను పరీక్షించనున్నారు. వైమానిక దళానికి చెందిన సీ-17, సీ-130, ఏఎన్ 32 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను ఇందుకోసం వినియోగించనున్నారు. పదాతిదళం, యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు, వైమానిక, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన సైనికులతో ఐబీజీని రూపొందించారు. సరిహద్దుల్లో పాకిస్థాన్, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను సమర్ధంగా తిప్పికొట్టడానికి ఈ విభాగానికి ఆర్మీ రూపకల్పన చేసింది.
By September 12, 2019 at 11:45AM
No comments