భర్త ఫోన్ మాట్లాడుతుండగా కాటేసిన పాములు.. మహిళ మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో విషాద ఘటన జరిగింది. ఓ మహిళ ఫోన్లో మాట్లాడుతూ చూసుకోకుండా పాములపై కూర్చోవడంతో అవి కాటేశాయి. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల కథనం ప్రకారం.. గగహా పోలీస్ స్టేషన్ పరిధిలోని రివాయ్ గ్రామానికి చెందిన జయసింగ్ థాయ్‌లాండ్‌లో ఉంటున్నాడు. అతడి భార్య గీత పిల్లలతో కలిసి గ్రామంలోనే ఉంటోంది. బుధవారం భర్త ఫోన్ చేయడంతో గీత మాట్లాడుతోంది. కొద్దిసేపటి తర్వాత ఫోన్ మాట్లాడుతూనే మంచంపై కూర్చుంది. అయితే అప్పటికే దానిపై రెండు పాములు ఉన్నాయి. గీత తేరుకుని పైకి లేచేలోపే ఓ పాము ఆమెకు కాటేసింది. దీంతో గీత కేకలు వేసుకుంటూ కింద పడిపోయింది. ఆమె నోటి నుంచి నురగలు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గీత ఆస్పత్రిలో చనిపోయింది.
By September 12, 2019 at 11:49AM
No comments