Breaking News

నానిస్ గ్యాంగ్ లీడర్ ఎందుకు చూడాలి?.. టాప్ 5 రీజన్స్ ఇవే


నానీ, విక్రమ్.కె.కుమార్‌ల కలయికలో తెరకెక్కిన ఈ ప్రోమోస్‌తోనే అందరిలో పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చెయ్యగలిగింది. ఈ సినిమా ఎందుకు చూడాలి అనే ప్రశ్నకు ఆన్సర్‌గా అదిరిపోయే అయిదు పాయింట్స్ ఉన్నాయి. ఆ అయిదు ఫ్యాక్టర్స్ పెర్ఫెక్ట్‌గా వర్క్ అవుట్ అయినా కూడా గ్యాంగ్ లీడర్ మినిమమ్ హిట్ గా నిలుస్తుంది. 1. : ఎవడే సుబ్రహ్మణ్యం నుండి కూడా రొటీన్‌గా ఉన్న సినిమాలతోనే విజయాలు సైతం అందుకున్న నాని జెర్సీ సినిమా నుండి మాత్రం కొత్త కథలను అటెంప్ట్ చెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చాడు. కానీ జెర్సీ సినిమాలో బరువు ఎక్కువయిపోవడంతో మాస్ ప్రేక్షకులకు జెర్సీ పూర్తిగా నచ్చలేదు. కానీ ఈ సినిమాకి ఆ ప్రాబ్లెమ్ లేదు. నాని నుండి ఆశించే అన్ని అంశాలు పుష్కలంగా ఉన్న కథ నానిస్ గ్యాంగ్‌లీడర్. ఈ టైటిల్‌లో కూడా నానీ పేరు పెట్టడానికి కారణం టైటిల్ కాంట్రావర్సీ క్లియర్ చేసుకోవడం మాత్రమే కాదు, ఈ సినిమా అంతా నాని మీదే నడుస్తుంది అని చెప్పడానికి కూడా. ఈ సినిమాలో తననుండి ఎంత ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు అనేది ఆల్రెడీ ప్రోమోస్‌తో చూపించేసాడు నానీ. ఈ ఒక్క పాత్ర సరిగ్గా వర్క్‌అవుట్ అయినా చాలు సినిమా నిలబడిపోవడానికి. 2. విక్రమ్.కె.కుమార్ : ఎంచుకున్న బేసిక్ ప్లాట్‌లోనే కొత్తదనం ఉండేలా చూసుకునే డైరెక్టర్ విక్రమ్.కె.కుమార్. గతంలో విక్రమ్ డైరెక్ట్ చేసిన 13B, మనం,24 సినిమాలు చూస్తే అతని ఆలోచనలు ఎంత అడ్వాన్స్డ్‌గా ఉంటాయో,ఎంతగా ఆకట్టుకుంటాయో అర్థమవుతుంది. అయితే విక్రమ్ తెరకెక్కించిన హలో ఫెయిల్యూర్‌గా మిగలలేదు, సక్సెస్ అనిపించుకోలేదు. కానీ ఈ సారి మాత్రం విక్రమ్ హిట్ కొట్టి తీరాలి. ఈ స్టేజ్‌లో అతని కెరీర్‌కి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఎంత అవసరమో అతనికి కూడా తెలుసు. అందుకే వినగానే కిక్ ఇచ్చే పాయింట్ ఎంచుకున్నాడు. సో,అతను అనుకున్న థాట్స్ అన్నీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయితే మిడ్‌రేంజ్ సినిమా అయిన పెద్ద హిట్ గా నిలుస్తుంది. Also Read: 3. అనిరుథ్ మ్యూజిక్: తమిళ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న అనిరుథ్‌కి తెలుగులో మాత్రం ఇంకా సరయిన హిట్ పడలేదు. జెర్సీ సినిమా ఒక థీమ్‌తో సాగిన సినిమా కావడం వల్ల అక్కడ పూర్తిగా ఫ్రీడమ్ దొరకలేదు. కానీ గ్యాంగ్‌లీడర్‌కి అనిరుథ్ మ్యూజిక్ కూడా మంచి ఎస్సెట్ గా మారినట్టే కనిపిస్తుంది. అతని మ్యూజిక్ ఈ సినిమాకి ఖచ్చితంగా బలంగా మారేలా ఉంది. అనిరుథ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మ్యూజికల్ లవర్స్ కూడా గ్యాంగ్‌లీడర్ ని ఇష్టపడడం ఖాయం అనిపిస్తుంది. 4. మైత్రి మూవీ మేకర్స్: శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ అందుకున్న మైత్రిమూవీ‌మేకర్స్‌కి ఈ మధ్య మాత్రం సరయిన హిట్ పడలేదు. అందుకే ఈ‌సారి ఎలాగయినా హిట్ కొట్టాలనే ఆలోచనతో కాస్త గ్యాప్ తీసుకుని మరీ ఈ సినిమాని తెరకెక్కించారు. అందుకే ఈ సినిమా నిర్మాణంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి హెల్ప్ అయ్యేలా ఉన్నాయి. 5. స్టార్‌కాస్ట్ అండ్ టెక్నికల్‌టీమ్: డైరెక్టర్ అనుకున్న కథని స్క్రీన్ మీద సరిగ్గా ప్రెజెంట్ చెయ్యగల టెక్నికల్ టీమ్ ఈ సినిమాకి కుదిరింది. DOP వినోద్ దగ్గరనుండి మొత్తం టీమ్ అంతా కూడా ఈ సినిమాకి రిచ్‌లుక్ తేవడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలించాయి. అలాగే తమ నటనతో సీన్స్‌లోని కంటెంట్‌ని ఎలివేట్ చెయ్యగల స్టార్‌కాస్ట్ కూడా కుదిరింది. నానీ సినిమాని మోసే క్రమంలో ఎక్కడయినా కాస్త డల్ అయినా కూడా సపోర్ట్ ఇవ్వడానికి మిగతా సీనియర్ యాక్టర్స్ సైతం బాగానే ఉపయోగపడతారు. పైన చెప్పుకున్న ఈ అయిదు ఫ్యాక్టర్స్‌లో కొన్ని కలిసొచ్చినా కూడా గ్యాంగ్‌లీడర్ అందరికి మెప్పించడం ఖాయం.హిట్ అనిపించుకోవడం గ్యారంటీ.


By September 12, 2019 at 11:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/here-are-top-5-reasons-to-dont-miss-to-watch-nanis-gang-leader/articleshow/71092445.cms

No comments