ప్రియుడితో వెళ్లిపోయి పరువు తీసిందని కూతురిని చంపేశాడు

ప్రియుడితో వెళ్లిపోయి పరువు తీసిందన్న అసహనంతో ఓ వ్యక్తి కన్నకూతురినే దారుణంగా చంపేశాడు. రాష్ట్రంలోని గంజాం జిల్లా గుండూరిబాడి గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన 17ఏళ్ల బాలిక ఆగస్టు 25వ తేదీన కనిపించకుండా పోయింది. ఆమె ఎవరో యువకుడితో వెళ్లిపోయిందని గ్రామంలో పుకార్లు రావడంతో ఆమె తండ్రి పరువు పోయిందని మనస్తాపం చెందాడు. Also Read: బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా కూతురి ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15వ తేదీన బాలిక తిరిగొచ్చినా తండ్రి ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆమె పక్క ఊరిలో ఉండే మేనమామ ఇంటికి వెళ్లింది. దీంతో ఆమె తండ్రి అక్కడికి వచ్చి ఆమె ప్రేమించిన అబ్బాయి గురించి ఆరా తీశాడు. ఆమె ఎలాంటి వివరాలు చెప్పకపోవడంతో ఇంటికి వెళ్దామని కూతురిని తీసుకెళ్లాడు. Also Read: మార్గమధ్యలో ఇదే విషయమై తండ్రీ కూతుళ్ల మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. తండ్రి ఆవేశంతో ఆమె గొంతు నులిచి చంపేసి పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. ఈ నెల 19వ తేదీన బాలిక మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు విచారణ చేయగా తండ్రి చేసిన కిరాతకం వెలుగుచూసింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. Also Read:
By September 29, 2019 at 07:55AM
No comments