చిరంజీవిపై ఐఏఎస్ అధికారి షాకింగ్ కామెంట్
మెగాస్టార్ చిరంజీవిపై పరోక్షంగా కామెంట్ చేశారు ఓ ఐఏఎస్ అధికారి. పైగా ఆయన భారతదేశానికి చెందిన టాప్ 10 ఇన్‌స్పైరింగ్ ఐఏఎస్ అధికారుల్లో ఒకరు. విషయమేంటంటే... ఇటీవల ప్రియదర్శి తన ఆరాధ్య నటుడైన మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చిరుతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు.. ‘సదా మీ ఏకలవ్య శిష్యుడిని’ అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ ఫొటో చూసిన పరికిపండ్ల నరహరి అనే ఐఏఎస్ అధికారి కామెంట్ చేశారు. ‘బ్రదర్ ప్రియదర్శి.. నేను రుద్రవీణ సినిమా చూసి ఐఏఎస్ అధికారి కావాలనుకున్నాను. మీరు కూడా మంచి యాక్టర్ అని ‘మల్లేశం’ సినిమాతో నిరూపించుకున్నారు. శుభాభినందనలు. కానీ చిరంజీవిని పొగడకుండా సినీ పరిశ్రమలో ఉండటం కష్టమా బ్రదర్?’ అని ప్రశ్నించారు. ఇందుకు ప్రియదర్శి సమాధానం ఇస్తూ.. ‘ధన్యవాదాలు సర్. చిరంజీవి సర్ ఎంచుకునే కథలకు ఓ విలువ ఉంటుంది. అవి మా జీవితాలకు ఎంతో పనికొస్తాయి’ అని స్పందించారు. దాంతో చిరు ఫ్యా్న్స్ ఒక్కసారిగా ఆయనపై గుర్రుమన్నారు. ‘గౌరవనీయ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఏమీ అనకుండా వదిలేస్తున్నాం. చిరంజీవి అంటే యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ పడిచస్తుంది. ఆయన లేనిదే సినీ పరిశ్రమను ఊహించుకోలేం. ఎందరో హీరోలకు అన్నయ్య స్ఫూర్తిదాయకం. కాబట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే చిరుని పొగడాల్సిందేనా అన్న మీ ఆలోచనను మార్చుకోండి’ అంటూ చీవాట్లు పెట్టారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన నరహరి ఈ ప్రశ్న ఎందుకు అడిగాల్సి వచ్చిందో ఆయనకే తెలియాలి. చిరుపై అభిమానం ఉన్నట్లు నటించాల్సిన అవసరం మన హీరోలకు లేదు. ఇక్కడ అందరూ సొంత టాలెంట్‌తోనే బతుకుతున్నారు. అంతెందుకు చిరు గురించి ప్రశ్నించాలనుకున్నప్పుడు నేరుగా తనకున్న సందేహాన్ని వ్యక్తిం చేయకుండా సేఫ్ సైడ్‌గా రుద్రవీణ సినిమా చూశాకే ఐఏఎస్ అధికారి అవ్వాలనుకున్నానని చెప్పాల్సిన అవసరం ఏముందో ఆయనకే తెలియాలి. ప్రస్తుతం నరహరి మధ్యప్రదేశ్‌లో అర్బన్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
By September 13, 2019 at 10:31AM
No comments