భారీగా ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుక.. గెస్ట్‌లు ఎవరంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధ ఆధారంగా రూపొందిన చిత్రం ‘సైరా’ అక్టోబర్ 2న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుంది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ్, కన్నడలో రిలీజ్ అవుతున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు మరింత హైప్ పెరిగింది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఈనెల 18న ఈమూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో భారీ సెట్ వేసి జరపనున్నారు చిత్ర యూనిట్.
ఈ మెగా ఈవెంట్‌కి చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, వివి వినాయక్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథులగా హాజరవుతారని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్‌లో తెలిపింది. అయితే మరి ఏమైందో ఏంటో కొద్దిసేపటికే మరో ప్రకటన చేశారు. ఈ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరుకావడం లేదని వెల్లడించారు. ఆయనకు యేవో ప్రభుత్వ అధికార కార్యక్రమాలు ఉండడంతో ఆయన రావడం కష్టం అని తెలిపారు.
దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, అనుష్క, తమన్నా, నిహారిక నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉంది ఈ మూవీ. రాజమౌళి కోసం ఒక షో వేసి ఆయన సూచనలు మేరకు సినిమాలో మార్పులు చేయనున్నారనే టాక్ నడుస్తోంది.
By September 14, 2019 at 02:43AM
No comments