Breaking News

‘గ్యాంగ్‌లీడర్’ ప్రివ్యూ టాక్: నాని మళ్లీ కొట్టాడు


విక్రమ్. కె కుమార్ - నాని కాంబినేషన్‌లో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ మంచి అంచనాలు మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్‌కి ఈమూవీ హిట్ అవ్వడం చాలా అవసరం. మొదటి నుండి చెపుతున్నట్టు ఇదొక కామెడీ ఎంటర్టైనర్ అంటున్నారు ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు. అసలు ఈ సినిమా ఎలా ఉందో? ప్రివ్యూ టాక్ ఏంటో చూద్దాం పదండి.

సినిమా స్లోగా స్టార్ట్ అయినా ఆ తరువాత ఊపందుకుంటుందట. మధ్యమధ్యలో వచ్చే కామెడీ సీన్స్‌తో పాటు వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ వరకు ఎంటర్టైనర్ గా సాగే స్టోరీ లో ఇంటర్వెల్ కి ఓ ట్విస్ట్ వస్తుంది. అది సెకండ్ హాఫ్ లో కూర్చునేలా చేస్తుందట. సీరియస్‌ మోడ్‌లో సాగే కథలో తనదైన పకడ్బందీ స్క్రీన్‌ప్లే‌తో ప్రీ క్లైమాక్స్ వరకు ఆడియన్స్‌ని సినిమాతో ఎమోషనల్‌గా సాగేలా చేయడంలో డైరెక్టర్ విక్రమ్ కుమార్ సక్సెస్ అయ్యాడు అని చెబుతున్నారు.

క్లైమాక్స్ లో నాని తన యాక్టింగ్‌తో అందరిని ఎమోషనల్ గా  కనెక్ట్ చేస్తాడు అని చెబుతున్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన ప్రియాంక, అలానే సీనియర్ నటులు లక్ష్మి, శరణ్య మోహన్‌లు తమ పాత్రలకు న్యాయం చేసారని చెబుతున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ ఒక ఎత్తు అయితే అనిరుధ్ మ్యూజిక్ మరొక ఎత్తు అని చెబుతున్నారు. నెగిటివ్ పాత్రలో నటించిన కార్తికేయ కెరీర్‌కి ఈసినిమా  ప్లస్ అవుతుందని చెబుతున్నారు. నాని ఖాతాలో మరో హిట్ అని చెబుతున్నారు.



By September 14, 2019 at 02:23AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47425/nani-gang-leader.html

No comments