Breaking News

గోపీచంద్ ‘చాణక్య’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్సయింది


‘చాణక్య’ షూటింగ్ పూర్తి.. సెప్టెంబ‌ర్ 9న టీజ‌ర్ విడుద‌ల‌

మ్యాచో హీరో గోపీచంద్‌, మెహ‌రీన్ జంట‌గా న‌టిస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ‘చాణక్య‌’. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన గోపీచంద్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఈ సినిమా టీజ‌ర్‌ను సెప్టెంబ‌ర్ 9 సాయంత్రం గంట‌లు 4.05 నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్‌.

నటీనటులు:

గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు

సాంకేతిక వర్గం:

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు

ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి

కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర

మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్

సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి

రైటర్: అబ్బూరి రవి

ఆర్ట్: రమణ వంక

కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్

పి.ఆర్.ఒ: వంశీ శేఖర్



By September 09, 2019 at 05:45AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47351/gopichand.html

No comments