‘వీడే సరైనోడు’ స్పెషల్ షో అడుగుతున్నారట!
వీడే సరైనోడు సినిమా విజయానికి సహకరించిన నిర్మాత కోకా శిరీష గారికి ధన్యవాదాలు: సమర్పకులు జక్కుల నాగేశ్వరరావు
జీవా, నయనతార జంటగా తమిళంలో రూపొంది విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో ‘వీడే సరైనోడు’ పేరుతో అనువదించారు. నోవా సినిమాస్ పతాకంపై కోకా శిరీష సమర్పణలో జక్కుల నాగేశ్వరావు అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.
ఈ సందర్భంగా సమర్పకులు జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘‘కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా తప్పకుండా ఆడుతుంది. గతంలో నేను చేసిన లవ్ జర్నీ సినిమాను ఆదరించారు. అలాగే ఈ సినిమా కూడా అదే తరహాలో సక్సెస్ సాధించింది. అందుకు కారణం ప్రేక్షక దేవుళ్ళు. సినిమా విడుదలైన అన్ని ఏరియాల నుండి గుడ్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి నటులు ఉన్నారు. క్లైమాక్స్ ఈ సినిమాకు ఆదనవు ఆకర్షణ అయ్యిందని డిస్టిబ్యూటర్స్ చెబుతున్నారు. మా సినిమా పబ్లిసిటీకి బాగా ఖర్చు పెట్టారు నిర్మాత కోకా శిరీషగారు, వారికి నా ధన్యవాదాలు. భవిషత్తులో మా కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రానున్నాయి. నయనతార, జీవ నటన సినిమాకు అదనపు ఆకర్షణ అయ్యింది. వీడే సరైనోడు సినిమా చూడాలి స్పెషల్ షో వెయ్యమని ఇండస్ట్రీలో చాలామంది అడుగుతున్నారు. నేను విడుదల చేసిన సినిమాల్లో ఇది పెద్ద సక్సెస్ సాధించడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్నీ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాను. మీడియా ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానను..’’ అన్నారు.
నటీనటులు: జీవా, నయనతార
సాంకేతిక నిపుణులు:
సమర్పణ: జక్కుల నాగేశ్వరరావు
సంగీతం: శ్రీకాంత్ దేవా, సాహిత్యం : వెన్నెలకంటి, చంద్రబోస్
మాటలు: రాజశేఖర్ రెడ్డి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.ఎస్. రామనాథం.
By September 09, 2019 at 05:27AM
No comments