Breaking News

ఆటో ఎక్కిన పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నం


స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్తున్న పదో తరగతి బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో ఆమనగల్లులో గురువారం జరిగింది. కడ్తాల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆమనగల్లులోని ఓ స్కూల్‌లో టెన్త్ క్లాస్ చదువుతోంది. గురువారం సాయంత్రం స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు రోడ్డు పక్కన వేడిచూస్తోంది. అదే సమయంలో ఓ ఆటోలో వచ్చిన ఇద్దరు యువకుడు అటువైపే వెళ్తున్నామని చెప్పడంతో ఎక్కింది. Also Read: కొంతదూరం వెళ్లాక బాలికను మాటల్లోకి దించిన యువకులు అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. తమ కోరిక తీర్చాలని వేధించారు. ఆటోను రోడ్డు పక్కగా ఆపి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో భయపడిపోయిన బాలిక కేకలు వేస్తూ ఆటోలో నుంచి దూకి పరుగుపెట్టింది. దీంతో స్థానికులు కొందరు అక్కడికి వచ్చి ఇద్దరు యువకులను పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. Also Read: కామాంధుల నుంచి తప్పించుకునే క్రమంలో బాలికకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు ఆమెను ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్ తరలించారు. నిందితుల్లో ఒకరు హైదరాబాద్‌కు చెందిన యువకుడు కాగా.. మరొకరు ఒమన్ దేశస్తుడని పోలీసులు తెలిపారు. Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.


By September 13, 2019 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-men-arrested-for-rape-attempts-on-minor-girl-in-ranga-reddy-district/articleshow/71105936.cms

No comments