రమ్యకృష్ణ ‘క్వీన్’ ఫస్ట్ లుక్.. జయలలిత పాత్రలో ఇద్దరు!
ఒకప్పటి అందాల నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జీవితం ఆధారంగా వెబ్ సిరీస్ వస్తోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ వెబ్ సిరీస్‌లో జయలలితగా రమ్యకృష్ణ కనిపిస్తారని, దీనికి ‘క్వీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని కూడా అన్నారు. ఈ వార్తలను నిజం చేస్తూ వెబ్ సిరీస్ మేకర్స్ శనివారం ‘క్వీన్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రమ్యకృష్ణను వెనుక నుంచి చూపించారు. అంటే, జయలలిత ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నట్టు ఉన్న షాట్ అది. అన్నాడీఎంకే పార్టీ చిహ్నాన్ని గుర్తుచేస్తూ మూడు రంగుల బోర్డర్‌తో ఉన్న తెల్ల చీరను రమ్యకృష్ణ ధరించారు. Also Read: ఇదిలా ఉంటే, ఈ వెబ్ సిరీస్‌లో జయలలిత పాత్రను ఇద్దరు నటీమణులు పోషిస్తున్నారు. యంగ్ జయలలితగా అనిఖా సురేంద్రన్ కనిపిస్తారు. రాజకీయ నేతగా ఎదిగిన జయలలిత పాత్రను రమ్యకృష్ణ పోషించారు. ఈ వెబ్ సిరీస్‌కి గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. ప్రశాంత్ గతంలో ‘కిడారి’ అనే తమిళ సినిమాకు దర్శకత్వం వహించారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, తమిళుల ఆరాధ్య నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ పాత్రలో మలయాళ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ నటించినట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్‌ను ఎంఎక్స్ ప్లేయర్ సౌజన్యంతో నిర్మించారు. త్వరలోనే ఈ బయో వెబ్ సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్‌లో ప్రసారం కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తేనున్నారు.
By September 07, 2019 at 01:34PM
No comments