‘డిస్కోరాజా’తో శ్రుతిహాసన్ రొమాన్స్!!
మాస్ మహారాజా రవితేజ, విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఇప్పటికే మొదలైన షూటింగ్ విజయవంతంగా సాగుతోంది. ఈ చిత్రంలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్ పుత్, ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే ఈ ఇద్దరే కాకుండా మూడో హీరోయిన్ ఓ రేంజ్‌లో గ్లామర్ ఒలకబోయనున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఆ మూడో భామ ఎవరో కాదు.. ‘రేసుగుర్రం’, ‘గబ్బర్ సింగ్’ లాంటి సినిమాలతో టాలీవుడ్ కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన శ్రుతి హసన్. డిస్కోరాజాలో ఈ భామ ఓ కీలక పాత్రలో నటిస్తోందని సమాచారం. అంతేకాదు.. ఈమె పాత్రే సినిమాకు హైలైట్ కానుందట. ప్రస్తుతం శృతితో దర్శకనిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించి చాలా రోజులే అయ్యింది.. అందుకే టాలీవుడ్‌లో నటించాలని శృతి కూడా ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తోంది. అంతేకాదు.. గతంలో ‘బలుపు’ సినిమాలో రవితేజ సరసన ఈ ముద్దుగుమ్మ నటించింది. డిస్కోరాజాలో నటించడమే నిజమైతే రవితేజతో శృతి రెండోసారి రొమాన్స్ చేస్తుందన్న మాట. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.
By September 08, 2019 at 05:34AM
No comments