చంద్రయాన్-2 95 శాతం విజయవంతం.. 5 శాతం మాత్రమే విఫలం: ఇస్రో
చందమామ చిక్కినట్టు చిక్కి చివరి క్షణాల్లో చేజారిపోయింది. చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ సాఫీగా చంద్రుడిపై దిగుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అన్ని దశలనూ విజయవంతంగా దాటుకుంటూ వచ్చినా చివరకు గెలుపు వాకిట తడిబడింది. తొలి నుంచి ఆఖరి 15 నిమిషాలే అత్యంత కీలకమని శాస్త్రవేత్తలు చెబుతూనే వచ్చారు. కాగా, ఈ 15 నిమిషాల్లో 14 నిమిషాలు ల్యాండర్ ఎంతో సాఫీగా సాగుపోతూ ప్రతి అంచెనూ విజయవంతంగా అధిగమిస్తుంటే శాస్త్రవేత్తలు ఆనందంతో ఉబ్బితబ్బుబ్బి అయ్యారు. ఇక చందమామపై అడుగుపెట్టేశామని అనుకున్న దశలో ఊహించని అవాంతరం ఎదురయ్యింది. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. Read Also: కాగా, ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌ను దాదాపు కోల్పోయినట్లేనని ఈ ప్రయోగంలో పాల్గొన్న ఓ ఇస్రో సీనియర్ అధికారి తెలిపారు. ‘ప్రస్తుతానికి ల్యాండర్‌తో ఎలాంటి సంబంధాలు లేవని, అంటే దాదాపు కోల్పోయినట్లేనని. తిరిగి దానితో సంబంధాలను పునరుద్ధరించడం చాలా కష్టం’ అని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ లక్ష్యంతో ల్యాండర్ విక్రమ్‌ను ఒక లూనార్ రోజు (భూమిపై 14రోజులు) పనిచేసేలా రూపొందించారు. దానిలో రోవర్ ప్రజ్ఞాన్ 500మీ ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై పలు పరీక్షలు జరిపేలా తీర్చిదిద్దారు. Read Also: కానీ, చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీ దూరం వరకు విజయవంతంగా చేరిన ల్యాండర్ నుంచి అర్ధాంతరంగా సంకేతాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ల్యాండర్ తిరిగి పనిచేస్తుందా.. భవిష్యత్తులో దాన్నుంచి సంకేతాలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా అన్న సందిగ్ధత నెలకొంది. తాజాగా ఇస్రో అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. క్రాష్‌ల్యాండ్ అయ్యిందా లేక సమాచార వ్యవస్థలోని లోపమా.. దాని తాజా పరిస్థితి, పనితీరు గురించి తెలియకపోయినా చంద్రయాన్ -2 కోసం ఖర్చుచేసిన రూ.978 కోట్లు వృథా అయినట్లు కాదని, మొత్తం ప్రయోగం విఫలం కాలేదని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. Read Also: ల్యాండర్ నుంచి సంకేతాలు రాకపోవడం అంటే కేవలం 5 శాతం మాత్రమే విఫలమైనట్లని, 95 శాతం విజయవంతమైందని వ్యాఖ్యానించారు. చంద్రుడి కక్ష్య చుట్టూ విజయవంతంగా తిరుగుతోన్న ఆర్బిటర్ తన పని తాను చేస్తుందని, దీంతో 95 శాతం సక్సెస్ అయినట్టేనని తెలిపారు. ఆర్బిటర్ జీవితకాలం ఏడాది కాగా, ఆ సమయంలో జాబిల్లి చిత్రాలు, ఇతర సమాచారం అందజేస్తుందని తెలిపారు. అంతేకాదు, ల్యాండర్ పరిస్థితి గురించి చిత్రాలను తీస్తుందని వారు వివరించారు. వ్యోమనౌకలో ఆర్బిటర్ (2,379 కిలోల బరువు, ఎనిమిది పేలోడ్లు), విక్రమ్ ల్యాండర్ (1,471 కిలోలు, నాలుగు పేలోడ్లు), ప్రజ్ఞాన్ రోవర్ (27 కిలోలు, రెండు పేలోడ్లు) అమర్చారు. సెప్టెంబరు 2 ఆర్బిటర్ నుంచి విక్రమ్ విడిపోయింది. Read Also: జులై 22న జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్-2ను విజయవంతంగా నింగిలోకి పంపారు. ఐదుసార్లు భూకక్ష్య తగ్గిస్తూ, చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసిన చంద్రయాన్-2, చంద్రుడి దక్షిణధ్రువంలో దిగుతుండగా సంకేతాలు నిలిచిపోయాయి.
By September 07, 2019 at 01:44PM
No comments